హిందీలో విజయవంతమైన చిత్రాలకు చిరునామగా మారాడు ఆయుష్మాన్ ఖురానా. తాజాగా బట్టతల యువకుడిగా వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2017లో అతడు నటించిన ‘శుభ్ మంగల్ సావధాన్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘శుభ్ మంగల్ జ్యాదా సావధాన్’తో పలకరించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సినిమాలో ఆయుష్మాన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో అతడు గేగా కనిపించనున్నాడు. 2020 ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హితేశ్ కేవాలియా ఈ సినిమాకు దర్శకుడు. నీనా గుప్తా, గిరిరాజ్ రావు కీలక పాత్రలు పోషించనున్నారు.
