బాలీవుడ్ నటీనటులు ఒకరి తర్వాత ఒకరు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కూడా కరోనా సోకింది. సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో స్వీయనిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.
ఇటీవలే అక్షయ్ కుమార్, విక్కీ కౌషల్, భూమి పెడ్నేకర్, గోవింద తదితరులు కరోనా బారినపడ్డారు.
![katrina kaif](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11299939_ass-2.jpg)
ఇదీ చూడండి: బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్‌కు కరోనా