సినిమా చాలా విచిత్రమైంది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు సెలబ్రిటీ అయిపోవచ్చు. కానీ ఆ సెలబ్రిటీ హోదాను నిలబెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే. బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా కూడా ఇదే విషయం చెబుతోంది. ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోలేదు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి సెలబ్రిటీ కల్చర్ ఆమెకు చిన్నప్పటి నుంచీ అలవాటే. కానీ అది ఆమెకు ఇష్టం లేదని చెబుతోంది.
![Bollywood actress Sonakshi Sinha says she cannot enjoy celebrity status](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9643403_1.jpg)
సెలబ్రిటీగా ఉండటంలో కష్టంగా అనిపించే విషయం ఏదైనా ఉందా? అంటే.. "లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచేలా ఉండటం అంటే మాటలు కాదు కదా. ప్రజలకు సరైన రోల్ మోడల్‌లా ఉండాలి. నిజాయతీగా వ్యవహరించాలి. నాకు ఇదంతా కష్టమేమీ కాదు. సెలబ్రిటీగా ఉండటంలో నావరకూ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అందరి దృష్టి నా మీదే ఉండటం. ఇలాంటి సెలబ్రిటీ హోదాను అస్సలు ఆస్వాదించలేను" అని చెప్పింది సోనాక్షి.