ETV Bharat / sitara

వెండితెరపై బాలీవుడ్​ అలనాటి తార బయోపిక్​ - మీనాకుమారి బయోపిక్​

బాలీవుడ్​ ట్రాజడీ క్వీన్​ మీనా కుమారి బయోపిక్​ వెండితెరపై సందడి చేయనుంది. ఆమె జీవిత చరిత్రను సినిమా రూపంలో నిర్మించనున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ ఆల్మైటీ మోషన్ పిక్చర్​. త్వరలోనే నటీనటుల గురించి చెప్తామని స్పష్టం చేశారు.

Meena Kumari
మీనా కుమారి
author img

By

Published : Aug 20, 2020, 9:24 PM IST

బాలీవుడ్​ అలనాటి తార మీనా కుమారి చక్కనైన ఆహార్యం, అభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె బయోపిక్​ను వెండితెరపైకి తీసుకురానుంది ప్రముఖ నిర్మాణ సంస్థ ఆల్మైటీ మోషన్​ పిక్చర్​. నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

జర్నలిస్ట్​ అశ్విని భత్​నగర్.. నటిపై రాసిన ప్రస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమె వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎదుర్కొన్న అవరోధాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎలా చేరిందో ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు అశ్విని.

Meena Kumari
మీనా కుమారి

తొలుత వెబ్​సిరీస్​ ​రూపొందించాలని భావించింది నిర్మాణ సంస్థ. కానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది.

మీనా కుమారి.. భారతీయ సినిమా చరిత్రలో ట్రాజడీ క్వీన్​గా పేరుగాంచారు. బాలీవుడ్​లో అత్యంత గొప్ప నటీమణిగా ఘనత సాధించారు. తన 30 ఏళ్ల కెరీర్​లో దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసికల్​ హిట్లుగా నిలవడం విశేషం. వాటిలో 'పాకీజా', 'సాహిబ్ బీబీ ఔర్ గులాం', 'మేరే అప్నే', 'ఆర్తీ', 'బైజు బవారా', 'పరిణీతా', 'దిల్ అప్నా ఔర్ ప్రీత్' సూపర్​హిట్లుగా నిలిచాయి.

ఇది చూడండి 'మహేశ్​బాబు​ ఇంట్లో లేకుంటే ఉండేది ఇక్కడే..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.