ప్రపంచ మాజీ ఛాంపియన్, చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్రను త్వరలోనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్నారు. ఆనంద్ కెరీర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని, జీవితంలో ఆయన ఎదుర్కొన్న ప్రతి సంఘటనను తెరపై చూపించనున్నారు. రాయ్.. అంతకుముందు 'తను వెడ్స్ మను', 'రాంఝానా' సినిమాలను తెరకెక్కించారు.
విశ్వనాథన్ ఆనంద్.. మెదడుకు పదునెక్కువ.. ఆలోచనలకు వేగం ఎక్కువ. ఆయన వ్యూహాలకు ప్రత్యర్థులు చేతులెత్తేస్తారు. ఆరేళ్ల వయసులోనే ఆనంద్ చెస్ ఆడటం ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆటలో దిగ్గజ స్థాయికి ఎదిగారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి.. చదరంగం క్రీడలో ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. గతేడాది డిసెంబరులో 'మైండ్ మాస్టర్' పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో తన బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటిస్తే బాగుంటుందని చెప్పారు ఆనంద్.
-
My favourite picture from Mexico pic.twitter.com/VP1EEOtKjt
— Viswanathan Anand (@vishy64theking) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My favourite picture from Mexico pic.twitter.com/VP1EEOtKjt
— Viswanathan Anand (@vishy64theking) September 30, 2020My favourite picture from Mexico pic.twitter.com/VP1EEOtKjt
— Viswanathan Anand (@vishy64theking) September 30, 2020
ఇదీ చూడండి : నా బయోపిక్‌లో ఆమిర్ నటించాలి: విశ్వనాథన్ ఆనంద్