ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' షూటింగ్​ అమెరికాలో కాదు! - సర్కారు వారి పాట షూటింగ్​ దుబాయ్​లో

ప్రిన్స్​ మహేశ్​బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' షూటింగ్​ జనవరి 25 నుంచి ప్రారంభంకానుందని సమాచారం. తొలి షెడ్యూల్​ను దుబాయ్​లో జరపాలని చిత్రబృందం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.

Big change in Mahesh, Keerthy's Sarkaru Vaari Paata!
'సర్కారు వారి పాట' షూటింగ్​ అమెరికాలో కాదు!
author img

By

Published : Jan 14, 2021, 1:44 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'.. ఈ నెలలోనే రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభం కానుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్​ను తొలుత అమెరికాలో ప్రారంభించాలని నిర్ణయించినా.. కరోనా కారణంగా దుబాయ్​లో చిత్రీకరించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

దుబాయ్​లో జనవరి 25 నుంచి 'సర్కారు వారి పాట' తొలి షెడ్యూల్​ ప్రారంభం కానుందని సమాచారం. 25 రోజుల పాటు అక్కడ షూటింగ్​ జరపనున్నారట. ఇందులో మహేశ్​ బాబుతో సహా ఇతర నటీనటులు పాల్గొననున్నారని తెలుస్తోంది.

తొలి షెడ్యూల్​ పూర్తైన తర్వాత చిత్రబృందం హైదరబాద్​ తిరిగి రానుంది. ఇక్కడ మరో షెడ్యూల్​ షూటింగ్​ ముగించుకున్న తర్వాత అమెరికా వెళ్లాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారని సమాచారం. ఈ చిత్రానికి పరశురామ్​ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్​, మహేశ్​ బాబు జీఎంబీ ఎంటర్​టైనర్స్​, 14 రీల్స్​ ప్లస్​ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈసారి మంట మామూలుగా ఉండదు: రామ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.