బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. కొద్దిరోజుల వరకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే అమితాబ్ మాత్రం తనకున్న పనుల్లో తిరిగి నిమగ్నమయ్యారు. రోజుకు 18 గంటలు పని చేస్తున్నట్లు తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు.
అనారోగ్యం వల్ల అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షో ఆలస్యమైంది. ఈ కారణంగా ఈ షోకు సంబంధించిన మూడు ఎపిసోడ్లను ఒకే రోజులో పూర్తి చేశారు బిగ్ బీ.
"అవును, నేను పని చేస్తున్నాను. ప్రతిరోజూ పని చేస్తాను, నిన్న కూడా చేశాను. రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నాను. ఈ పనే నాకు భరోసా, ప్రేమ, ఆశిర్వాదాలను ఇచ్చింది"
-అమితాబ్ బచ్చన్, సినీ నటుడు
ఇటీవలె కేబీసీ సెట్లో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ "పనిచేయకపోతే ఎలాంటి పని ఉండదు" అంటూ కామెంట్ పెట్టారు బిగ్ బీ.
అనారోగ్య సమస్యల కారణంగా కోల్‌కతాలో జరిగే 25వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ట్రిప్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిపారు అమితాబ్. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సామాజిక మాద్యమాల ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చూడండి: ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్ కాకపోయుంటే!