Alia bhatt ranbir kapoor: హీరోయిన్ ఆలియా భట్.. హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రస్తుతం ప్రేమలో ఉంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ దీని గురించి ఈ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. రణ్‌బీర్‌ను 'బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ ఎవర్' అంటూ ఆలియా చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆలియా ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియావాడి' ట్రైలర్ శుక్రవారం రిలీజైంది. ఇందులోని చేతులు పైకెత్తి దండం పెట్టే స్టిల్‌లో రణ్‌బీర్-ఆలియా ఫొటోలను కొలేజ్ చేసి ఇన్‌స్టాలో ఓ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేశారు. దానిని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఆలియా.. రణ్‌బీర్‌ను ఉద్దేశిస్తూ 'బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ ఎవర్' అంటూ రాసుకొచ్చింది.
ముంబయిలోని మాఫీయా క్వీన్ గంగూబాయ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశారు. అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్ర పోషించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. కరోనా వల్ల ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: