దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ సినిమా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే అమ్మ జీవిత కథలో శోభన్‌బాబు పాత్ర ఎవరు చెయ్యబోతున్నారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ఈ సోగ్గాడి పాత్రలో కనిపించబోయేది విజయ్‌దేవరకొండ అని అనేక వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడీ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తాను చిత్రబృందం ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
జిషుసేన్ ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు చేశాడు. బాలయ్య కథానాయకుడిగా నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’లో ఎల్వీ ప్రసాద్‌గా కనిపించగా... ఇటీవల విడుదలైన 'అశ్వథ్థామ'లో సైకో విలన్‌గా దర్శనమిచ్చి మెప్పించాడు. తలైవిలోని శోభన్‌బాబు పాత్ర కోసం ఇప్పటికే జిషు సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవింద స్వామి.. కరుణానిధిగా ప్రకాష్‌రాజ్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ ఏడాది ద్వితియార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదీ చదవండి: నితిన్.. నిఖిల్ల పెళ్లి ఒకే రోజు..!