ETV Bharat / sitara

కరోనా వ్యాప్తి ఉన్నా సరే లండన్​కు అక్షయ్ - bell bottom akshay kumar

కొత్త సినిమా షూటింగ్​లో భాగంగా హీరో అక్షయ్ కుమార్​తో పాటు పలువురు నటీనటులు, వచ్చే నెలలో లండన్​కు వెళ్లనున్నారు. ఈ మేరకు అక్షయ్ ట్వీట్ చేశారు.

కరోనా వ్యాప్తి ఉన్నా సరే లండన్​కు అక్షయ్
బెల్ బాటమ్ చిత్రబృందంతో అక్షయ్
author img

By

Published : Jul 6, 2020, 3:39 PM IST

కరోనా నేపథ్యంలోనూ విదేశాల్లో షూటింగ్​ చేసేందుకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం నటిస్తున్న 'బెల్ బాటమ్' చిత్రీకరణ, ఆగస్టు నుంచి లండన్​లో జరగనుందని ట్వీట్ చేశారు. ఈ షెడ్యూల్​లో భాగంగా అక్షయ్​తో పాటు హ్యుమా ఖురేషి, లారా దత్తా తదితరులు యూకే వెళ్లనున్నారు.

కన్నడ హిట్​ 'బెల్​బాటమ్'కు రీమేక్​ అయిన ఈ చిత్రాన్ని, 1980లో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో వాణీ కపూర్​ హీరోయిన్. రంజిత్ ఎమ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.