ETV Bharat / sitara

బండ్ల గణేశ్ షాకింగ్​ నిర్ణయం.. త్వరలో దానికి దూరం - బండ్ల గణేశ్ ట్వీట్లు

బండ్ల గణేశ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు​. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఆయన.. మరో దానికి త్వరలో దూరం కానున్నట్లు చెప్పారు.

bandla ganesh
బండ్ల గణేశ్
author img

By

Published : Aug 14, 2021, 6:33 PM IST

బండ్ల గణేశ్.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. హాస్యనటుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు​. ఎంతోమంది స్టార్​ హీరోలతో సూపర్​హిట్​లు తీసిన ఆయన.. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. అయితే తన ట్విట్టర్​ ద్వారా శనివారం షాకింగ్ కామెంట్స్ చేశారు బండ్ల.

గుడ్​బాయ్..

bandla ganesh tweet
బండ్ల గణేశ్ ట్వీట్​

"త్వరలో ట్విట్టర్​కు గుడ్​బాయ్ చెప్పేస్తా. వివాదాలు ఏమీ లేవు.. నా జీవితంలో నేను ఎలాంటి వివాదాలను కోరుకోవటం లేదు" అంటూ బండ్ల గణేశ్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

2020 జనవరిలో విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో చివరగా కనిపించారు బండ్ల. ఈ సినిమాలో తన మార్క్ కామెడీతో అలరించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి కొన్నినెలల క్రితం హాజరైనప్పుడు.. సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఎదిగిన క్రమంలో హీరో పవన్​కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్​కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: Bandla ganesh: 'వాళ్లకు పెన్​తో కిక్​.. నాకు మైక్​ ఉంటే కిక్​!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.