సినీ కుటుంబాల్లో తమ వారసులను చిన్నప్పుడే ఏదో ఒక పాత్రల్లో నటింపజేస్తూ వారిని సినిమా రంగంవైపు వచ్చేలా చేస్తుంటారు. అలా మన తెలుగు సినిమా రంగంలో చాలామందే ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇంకా చిత్రసీమ వైపు అడుగులు వేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఓ వార్త బయటకు వచ్చి వైరల్ అవుతోంది.
బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను త్వరలోనే నటనలో శిక్షణ పొందేందుకు విదేశాలకు పంపనున్నారట. అయితే అధికారికంగా ఎక్కడా ఈ వార్త బయట పడలేదు. ఆ మధ్య కాలంలో మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం చేయనున్నాడని కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మోక్షజ్ఞ నిజంగానే విదేశాలకు వెళ్తున్నాడా.. ఒక వెళ్తే అది నటన శిక్షణ కోసమేనా అనేదానిపై స్పష్టత లేదు.
ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ కొత్త సినిమా వచ్చేది అప్పుడే..!