కరోనా లాక్డౌన్ కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు తన వంతు సాయం చేస్తున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఈ మేరకు 700 మంది కార్మికులను ముంబయి నుంచి యూపీలోని వారి స్వస్థలాలకు చేర్చేందుకు నాలుగు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు బిగ్‌బీ.
బుధవారమే ముంబయి నుంచి అలహాబాద్, గోరఖ్‌పూర్, వారణాసి ప్రాంతాలకు విమానాలు నడిచాయి. గురువారం మరో రెండు విమానాలు ప్రయాణించనున్నాయి.
బచ్చన్ ఆదేశానుసారం సొంత నిర్మాణ సంస్థ ఏబీ కార్పొరేషన్ లిమిటెడ్.. మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ యాదవ్ విమానాల నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు బిగ్‌బీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కూలీల కోసం రైళ్లు బుక్ చేయాలనుకున్నప్పటికీ.. లాజిస్టిక్ సరిగా పని చేయడం లేదని పేర్కొన్నాయి.
ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్న 300 మంది వలస కూలీలను 10 బస్సుల ద్వారా స్వస్థలాలకు చేర్చారు అమితాబ్. మరోవైపు నటుడు సోనూసూద్ కూడా వలస కార్మికులకు అండగా నిలుస్తూ వారి పాలిట దైవంగా మారారు.