ETV Bharat / sitara

మళ్లీ షూటింగ్​లో పాల్గొన్న ఆయుష్మాన్ - ఆయుష్మాన్ షూటింగ్

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. అయితే సినిమా కోసం మాత్రం కాదు. మరి ఎందుకో తెలియాలంటే పూర్తి వార్త చదివేయండి.

షూటింగ్​లో పాల్గొన్న ఆయుష్మాన్
షూటింగ్​లో పాల్గొన్న ఆయుష్మాన్
author img

By

Published : Jul 10, 2020, 9:57 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా సినీతారలంతా మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా మాత్రం అప్పుడే ఓ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే అది సినిమా షూటింగ్​ కాదులెండి. ఓ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ కోసం చిత్రీకరించిన ప్రచార చిత్రంలో.!

ఇటీవల తన తల్లిదండ్రులను చూసేందుకు చండీగఢ్‌ వెళ్లిన ఆయుష్మాన్.. అక్కడే ప్రచార చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో కరోనా సంక్షోభంలో ఏ విధంగా షూటింగ్‌ చేస్తారో తెలుసుకున్నాడట. ఎనిమిది గంటలపాటు ఆయుష్మాన్‌ ఆ షూటింగ్‌లో పాల్గొన్నాడు. లాక్‌డౌన్‌ నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు, గ్లౌజ్‌లు ధరించి కేవలం 18 మందితో షూటింగ్‌ పూర్తి చేశారు.

"కొన్ని నెలల తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నటులమంతా ఇళ్లలో ఉన్నాం. తిరిగి మాకిష్టమైన పనులు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాం. అందరూ తమకు తాము సినిమా షూటింగ్స్‌కు ఎలా సన్నద్ధమవుతున్నారో చూశా. సంక్షోభం పోయి సాధారణ పరిస్థితులు వస్తాయి. మేమంతా షూటింగ్‌ ప్రాంతంలో జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లో పాల్గొంటాం."

-ఆయుష్మాన్‌ ఖురానా, నటుడు

లాక్‌డౌన్‌కు ముందు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆయుష్మాన్‌ ఖురానా 'గులాబో సితాబో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా థియేటర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లు మూతపడటం వల్ల ఓటీటీలో విడుదల చేశారు. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా.. అమితాబ్‌, ఆయుష్మాన్‌ ఖురానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.