ETV Bharat / sitara

సముద్రం అడుగున 'అవతార్​ 2' షూటింగ్​

author img

By

Published : Sep 13, 2020, 9:31 AM IST

ప్రఖ్యాత హాలీవుడ్​ దర్శకుడు జేమ్స్​ కామెరూన్​ దర్శకత్వంలో 'అవతార్​ 2' శరవేగంగా తెరకెక్కుతోంది. సముద్ర అంతర్భాగం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

Avatar 2 set photos show Sigourney Weaver filming stunts underwater
సముద్ర అంతర్భాగం నేపథ్యంలో 'అవతార్​ 2'

ప్రపంచ సినీఅభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'అవతార్‌' సిరీస్‌ ఒకటి. ఇందులో 'అవతార్‌-2' చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అవతార్‌' పండారా గ్రహం నేపథ్యంలో సాగితే.. 'అవతార్‌-2' సముద్ర అంతర్భాగం నేపథ్యంగా తెరకెక్కుతోంది. సముద్ర జలాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను.. ఇటీవల ఆ చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న సిగోర్ని వీవర్‌ వెట్‌సూట్‌లో ఉండగా.. మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో షూటింగ్​ చేస్తున్న దృశ్యాలను విడుదల చేశారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. 2021 డిసెంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారి దెబ్బకు 2022కు వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.