ETV Bharat / sitara

'మా' రాజకీయాల్లోకి అనసూయ, సుడిగాలి సుధీర్​ - మా ఎన్నికల్లో అనసూయ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే జరగనున్న మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నిక(MAA Elections)ల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్​ రాజ్​(Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu), జీవితా రాజశేఖర్​(Jeevitha Rajasekhar), హేమ(Hema) పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్​ రాజ్​ తాను పోటీ చేయనున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు వారి ప్యానెల్​లో పోటీ చేసే వ్యక్తుల పేర్లను వెల్లడించారు. వారిలో అనసూయ, సుడిగాలి సుధీర్​ ఉండడం విశేషం.

Anasuya and Sudigali Sudhir to contest in Movie Artist Association elections
'మా' రాజకీయల్లోకి అనసూయ, సుడిగాలి సుధీర్​
author img

By

Published : Jun 24, 2021, 6:20 PM IST

సెప్టెంబరులో జరగనున్న మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​(MAA Elections) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj), మంచు విష్ణు, జీవిత, హేమ పోటీపడనున్నారు. 'మా' అభివృద్ధి, సభ్యుల సంరక్షణతోపాటు, 'మా'కు శాశ్వత భవనం ఏర్పాటు వంటి అంశాలను అజెండాగా చేసుకుని వీరందరూ ఎన్నికల బరిలోకి దిగారు.

మరోవైపు అధ్యక్ష పదవి పోటీదారు ప్రకాశ్‌ రాజ్‌ 27 మంది సభ్యులతో కూడిన తన ప్యానల్‌ని గురువారం ప్రకటించారు. వీరికి మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) మద్దతు ఉందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ జాబితాలో ఈటీవీలో ప్రసారమవుతోన్న 'జబర్దస్త్​' బృందం నుంచి ఇద్దరు పోటీకి సిద్ధమవడం విశేషం. వారే యాంకర్​ అనసూయ (Anasuya Bharadwaj), హాస్యనటుడు సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer)​.

అనసూయ..

బుల్లితెరపై యాంకర్​గానే కాకుండా అనేక చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించింది అనసూయ భరద్వాజ్​. అయితే ఆమె వచ్చిన అనేక రూమర్లు, కామెంట్లపై పలుమార్లు బాహాటంగానే మాట్లాడింది. సోషల్​మీడియాలో ఆమెపై కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధీటుగా బదులు ఇవ్వడమే.. కాకుండా సమాజంలో జరిగే కొన్ని పరిణామాలపై తనదైన శైలిలో స్పందించిన సందర్భాలున్నాయి. దీంతో పాటు 'మా' ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తున్న క్రమంలో యాంకర్​ అనసూయకు ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​లో పోటీ చేసే అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

సుడిగాలి సుధీర్​..

అటు బుల్లితెరతో పాటు వెండితెరపైనా ప్రేక్షకులను తన హాస్యంతో ఆకట్టుకుంటున్నాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం టాలీవుడ్​లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​లో సుడిగాలి సుధీర్​ పోటీ చేయనున్నట్లు స్పష్టమైంది. అయితే బుల్లితెరపై 'జబర్దస్త్​'తో పాటు అనేక కార్యక్రమాల్లో తన హాస్యచతురతతో ఆకట్టుకుంటున్న సుడిగాలి సుధీర్​.. ఇప్పుడు 'మా' పోటీ చేయనుండడం పట్ల ఆసక్తి నెలకొంది.

'మా' ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​

1. ప్ర‌కాశ్​ రాజ్‌

2. జ‌య‌సుధ‌

3. శ్రీకాంత్‌

4. బెన‌ర్జీ

5. సాయి కుమార్‌

6. తనీష్‌

7. ప్ర‌గ‌తి

8. అన‌సూయ‌

9. స‌న

10. అనితా చౌద‌రి

11. సుధ‌

12. అజ‌య్‌

13. నాగినీడు

14. బ్ర‌హ్మాజీ

15. ర‌విప్ర‌కాష్‌

16. స‌మీర్‌

17. ఉత్తేజ్

18. బండ్ల గణేశ్​

19. ఏడిద శ్రీరామ్‌

20. శివారెడ్డి

21. భూపాల్‌

22. టార్జ‌ాన్‌

23. సురేశ్​ కొండేటి

24. ఖ‌య్యుం

25. సుడిగాలి సుధీర్

26. గోవింద‌రావు

27. శ్రీధ‌ర్‌రావు

వీరితో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు.. 'మా' ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకాశ్​ రాజ్​ ప్రకటించారు. సెప్టెంబరులో మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. "త్వరలో జ‌ర‌గ‌బోయే ఎన్నికలను పురస్కరించుకుని 'మా' శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్రతిష్ట కోసం.. మ‌న న‌టీనటుల బాగోగుల కోసం.. 'మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నా" అని పేర్కొన్నారు. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్రమే చేయ‌డం కోసం ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నా అని ప్రకాశ్​ రాజ్​ తెలిపారు.

ఇదీ చూడండి.. MAA Elections: 'మా' ఎన్నికల్లో బాలకృష్ణ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.