పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో అనన్య పాండే కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరితో పాటే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాడు.
ఈ సినిమా కోసం విజయ్.. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. 'జై లవకుశ' ఫేమ్ రోనిత్ రాయ్ విలన్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం 'ఫైటర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్రబృందం.
![vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6135094_rk7.jpg)
![vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6135094_rk1.jpg)
![vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6135094_rk.jpg)
ఇదీ చూడండి : మీసాల కృష్ణుడు సతీమణి నిర్మలమ్మ సినీ ప్రస్థానం