తన తల్లిని చిన్నచూపు చూస్తూ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నందా ఘాటుగా సమాధానమిచ్చారు. మహిళలను తక్కువగా చేసి చూడొద్దని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్య.. "బామ్మ జయాబచ్చన్, అమ్మ శ్వేతాబచ్చన్, అత్తయ్య ఐశ్వర్యారాయ్.. ఇలా వృత్తిపరమైన జీవితాలనూ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న మహిళల మధ్య నేను పుట్టి, పెరిగాను. లింగ సమానత్వం సాధించాలంటే విద్య, ఆర్థిక స్వతంత్ర్యం ఎంతో అవసరం అని అర్థమైంది." అని అన్నారు.
దీనిపై ఓ నెటిజన్.. 'శ్వేతాబచ్చన్.. చేసే పనేంటి?' అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌పై స్పందించిన నవ్య.. 'ఒక రచయితగా, డిజైనర్‌గా, సతీమణిగా, ముఖ్యంగా తల్లిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు' అని సమాధానమిచ్చారు. అనంతరం ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. 'ఒక భార్యగా, తల్లిగా ఉండడమే ఒక పెద్ద ఉద్యోగం. ఇల్లు చక్కదిద్దుకునే మహిళలను చిన్నచూపు చూడకండి. ఒక తరాన్ని మనకు అందించేది వాళ్లే. కాబట్టి వాళ్లను తక్కువ చేసి మాట్లాడకండి' అంటూ నవ్య పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: అమితాబ్ బచ్చన్.. 46 ఏళ్ల తర్వాత అదే చోట