అల్లు శిరీష్ కొత్త చిత్రం ప్రకటించేశాడు. రాకేష్ శశి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ (Megastar) అల్లుడు కల్యాణ్ దేవ్ అరంగేట్ర మూవీ విజేతకు దర్శకత్వం వహించింది ఇతడే. ఇందులో శిరీష్ (Sirish) సరసన అను ఇమ్మాన్యూయేల్ (Anu Emmanuel) హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీలుక్ రిలీజ్ చేశారు. ఇందులో శిరీష్, అను రొమాంటిక్ మూడ్లో కనిపించి ఆసక్తి పెంచుతున్నారు. ఫస్ట్ లుక్ను శిరీష్ పుట్టినరోజైన మే 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.