Alia Bhatt: స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న బాలీవుడ్ భామ ఆలియా భట్.. హాలీవుడ్ ఎంట్రీ ఖరారైపోయింది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌లో నటించనుంది ఆలియా. దీనిని నెట్‌ఫ్లిక్స్ తీసుకురానుంది.

ఈ చిత్రంలో హాలీవుడ్ సూపర్స్టార్లు గాల్ గాడట్, జేమీ డోర్నన్ సరసన నటించనుంది ఆలియా. దీనికి బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ఆలియా ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి' ఇటీవలే థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటోంది. అందులో ఆలియా నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్'లోనూ మెరవనుంది ఆలియా. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తోంది ఆలియా. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2022 సెప్టెంబర్ 9న విడుదలకానుంది.
ఇదీ చూడండి: మహేశ్‌బాబు- రాజమౌళి చిత్రంలో ఆలియాభట్..!