NTR new movie: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పేసింది. ఆ కథానాయికనే ఆలియా భట్. 'గంగూబాయ్ కతియావాడి' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆలియా భట్ టైటిల్ రోల్లో నటించిన సినిమా 'గంగూబాయ్ కతియావాడి'. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముంబయిలో గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పలువురు తెలుగు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆలియా.. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది.
త్వరలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. #ఎన్టీఆర్30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: