ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో' హిందీ రిలీజ్ వాయిదా - అలా వైకుంఠపురంలో హిందీ వెర్షన్ విడుదల తేదీ

Ala Vaikunthapurramloo Hindi version release date: 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్ర​ హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్​ మైన్స్​ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.

Ala Vaikunthapurramloo Hindi version release postponed

author img

By

Published : Jan 21, 2022, 7:38 PM IST

Ala Vaikunthapurramloo Hindi version release date: 'పుష్ప' సినిమా బాలీవుడ్​లో సంచలనం సృష్టించింది. ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజై దాదాపు రూ.80 కోట్ల మేర వసూళ్లు సాధించింది. అంతేకాదు, ఈ సినిమాతో బన్నీకి బీ టౌన్​లో విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. ఇదే ఊపును కొనసాగించేందుకు అల్లు అర్జున్​.. తివిక్రమ్ శ్రీనివాస్​ కాంబోలో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని గోల్డ్​మైన్స్ పిక్చర్స్ నిర్ణయించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 26న విడుదల చేస్తున్నట్లు టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే అకస్మాత్తుగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు గోల్డ్ మైన్స్ ప్రకటించింది.

'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో కార్తీక్​ ఆర్యన్​, కృతిసనన్​ జోడీగా రీమేక్​ చేశారు. దీనికి 'షెహజాదా' అని టైటిల్​ ఖరారు చేశారు. అలవైకుంఠపురములో డబ్బింగ్​ చిత్రం ఈ సమయంలో విడుదలైతే షెహజాదాకు తీవ్ర నష్టం నష్టం కలుగుతుందని నిర్మాతలు భావించారు.

Ala Vaikunthapurramloo Hindi version release
గోల్డ్​మైన్స్​ ప్రకటన

ఈ నేపథ్యంలో 'షెహజాదా' నిర్మాతలు.. 'అల వైకుంఠపురములో' డబ్బింగ్​ వెర్షన్​ హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్​మైన్స్​ టెలీ ఫిలింస్​ అధినేత మనీశ్​ షాతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడం వల్ల అల వైకుంఠపురములో డబ్బింగ్​ వెర్షన్​ విడుదల వాయిదా వేసేందుకు మనీష్​ షా అంగీకరించాడు. ఈ మేరకు గోల్డ్​మైన్స్​ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు షెహజాదా నిర్మాతలు మనీశ్​ షాకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.