వరుస సినిమాలతో దూకుడు మీదున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. మరో ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో అక్కీ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది తనతో 'మిషన్ మంగళ్' తీసిన జగన్ శక్తి.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో భారీస్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయని సమాచారం.
డబుల్ రోల్ కొత్తేం కాదు!
అక్షయ్ ద్విపాత్రాభినయం చేయడం ఇది తొలిసారేం కాదు. గతంలో 'జై కిసాన్', 'కిలాడీ 420', 'అఫ్లాతూన్', 'రౌడీ రాఠోడ్' సినిమాల్లో రెండు పాత్రల్లో మెప్పించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
అక్షయ్ నటించిన 'సూర్యవంశీ'.. థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల 'బెల్‌బాటమ్' చిత్రీకరణ పూర్తి చేశారు. 'అత్రాంగి రే', 'బచ్చన్ పాండే' సినిమాల షూటింగ్ జరుగుతోంది. 'రక్షా బంధన్', 'రామ్‌సేతు' చిత్రాలు ప్రారంభం కావాల్సి ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">