ETV Bharat / sitara

'వకీల్​సాబ్​'​లో‌ అకీరా నటించలేదు' - అకీరనందన్​ పవన్​కల్యాణ్​

'వకీల్​సాబ్'​ సినిమాలో పవన్​కల్యాణ్​ తనయుడు అకీరా నందన్​ నటించలేదని స్పష్టం చేశారు ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్​. పవన్​ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉందని, అది మాటల్లో వర్ణించలేనని చెప్పారు.

vakeelsaab
వకీల్​సాబ్​
author img

By

Published : Apr 8, 2021, 3:15 PM IST

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'వకీల్‌సాబ్‌'లో అకీరా నందన్‌ నటించలేదని దర్శకుడు వేణుశ్రీరామ్‌ క్లారిటీ ఇచ్చారు. ‘వకీల్‌సాబ్‌’ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వేణు పాల్గొని చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. అలాగే పవన్‌తో కలిసి పనిచేయడంలో ఉన్న ఆనందాన్ని బయటపెట్టారు. "సినిమా అంటే చిన్నప్పటి నుంచి తెలియని అభిమానం. సినిమాలు చూస్తూ జీవితాన్ని గడపమన్నా ఓకే అంటాను. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఆ సినిమా నుంచే ఆయనకి నేను ఒక అభిమానిగా మారాను. 'తొలిప్రేమ' విడుదలైన సమయంలో ఓకే రోజు వరుసగా నాలుగు షోలు అదే సినిమా చూసి. ఆయనంటే అంత ఇష్టం. అలాంటి ఆయన చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడం.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను" అని వేణు శ్రీరామ్‌ తెలిపారు.

అనంతరం 'వకీల్‌సాబ్‌' సర్‌ప్రైజ్‌ గురించి నెట్టింట్లో జరుగుతోన్న చర్చపై ఆయన స్పందించారు. "ఇటీవల తమన్‌, రామజోగయ్యశాస్త్రి, నేనూ కలిసి 'వకీల్‌సాబ్‌' ప్రమోషన్‌లో పాల్గొన్నాం. సెకండాఫ్‌లో ఓ సర్‌ప్రైజ్‌ ఉందని తమన్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో అందరూ.. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి లేదా రామ్‌చరణ్‌ అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా అకీరా సైతం ఈ సినిమాలో నటించారని అందరూ చెప్పుకుంటున్నారు. అందుంలో ఎటువంటి నిజం లేదు. 'వకీల్‌సాబ్‌'లో ఎలాంటి స్పెషల్‌ అప్పియరెన్స్‌లు లేవు" అని ఆయన వివరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్‌లో తెరకెక్కి.. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న 'పింక్‌'కు రీమేక్‌గా 'వకీల్‌సాబ్‌' వస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వస్తోన్న చిత్రమిది. బోనీకపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామస్‌, అనన్య, అంజలి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ ముఖ్యభూమిక పోషించారు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: పింక్‌ టు వకీల్‌సాబ్‌ వయా 'నేర్కొండపార్వై'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.