అశ్విన్ గంగరాజు దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న వైవిధ్యభరిత కథా చిత్రం 'ఆకాశవాణి'. ఓ రేడియో చుట్టూ దట్టమైన అడవిలో జరిగే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. టీచర్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సముద్రఖని పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం.
-
"Between God & Science, there is a TEACHER and that's him"
— Aakashavaani Movie (@AakashavaaniM) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Introducing Samuthirakani @thondankani as ‘𝘾𝙝𝙖𝙣𝙙𝙧𝙖𝙢 𝙈𝙖𝙨𝙩𝙚𝙧’ in #Aakashavaani 👨🏫#HappyTeachersDay @AshwinGangaraju @Padmana77597354 @kaalabhairava7 @sreekar_prasad @saimadhav_burra @sureshragutu1 pic.twitter.com/M97ZBouQZg
">"Between God & Science, there is a TEACHER and that's him"
— Aakashavaani Movie (@AakashavaaniM) September 5, 2020
Introducing Samuthirakani @thondankani as ‘𝘾𝙝𝙖𝙣𝙙𝙧𝙖𝙢 𝙈𝙖𝙨𝙩𝙚𝙧’ in #Aakashavaani 👨🏫#HappyTeachersDay @AshwinGangaraju @Padmana77597354 @kaalabhairava7 @sreekar_prasad @saimadhav_burra @sureshragutu1 pic.twitter.com/M97ZBouQZg"Between God & Science, there is a TEACHER and that's him"
— Aakashavaani Movie (@AakashavaaniM) September 5, 2020
Introducing Samuthirakani @thondankani as ‘𝘾𝙝𝙖𝙣𝙙𝙧𝙖𝙢 𝙈𝙖𝙨𝙩𝙚𝙧’ in #Aakashavaani 👨🏫#HappyTeachersDay @AshwinGangaraju @Padmana77597354 @kaalabhairava7 @sreekar_prasad @saimadhav_burra @sureshragutu1 pic.twitter.com/M97ZBouQZg
చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. "దేవుడికి మరియు సైన్సుకి మధ్య టీచర్ ఉన్నారు. ఆయనే చంద్రం మాస్టారు.." అంటూ పేర్కొన్నారు. ఇందులో సముద్రఖని చంద్రం మాస్టారు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
తొలుత ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని కారణాల వల్ల 'అండ్ ఐ స్టూడియోస్' సంస్థకు చెందిన పద్మనాభరెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకులు థియేటర్లోకి తీసుకొస్తామని చిత్రబృందం చెబుతోంది.