హాలీవుడ్ నటి, మోడల్ కిమ్ కర్దాషియాన్.. తన భర్త అమెరికన్ ర్యాపర్ కేన్ వెస్ట్ విడిపోతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రెండేళ్ల డేటింగ్ తర్వాత 2014లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్న ఈ జంట ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించకున్నారని తెలిసింది. ఇప్పటికే కిమ్ కర్దాషియాన్ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు అక్కడి ప్రముఖ వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి.
స్టార్ కపుల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కిమ్, కేన్‌కు మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నట్లుగా తెలిసింది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.
గతేడాది తన భర్త కేన్.. బైపోలార్ డిసార్డర్‌తో బాధపడున్నట్లు స్పష్టం చేసిన కిమ్.. ఈ సమస్య తన కుటుంబంపై ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అతడితో సన్నిహితంగా ఉండేవారు తన మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని జాలి చూపాలని విజ్ఞప్తి చేసింది. అతడిని తానెంతగానో ప్రేమిస్తున్నట్లు అప్పట్లో వివరించింది.
ఇదీ చూడండి: ర్యాపర్ కేన్ వెస్ట్ మానసిక పరిస్థితిపై నోరువిప్పిన కిమ్