దక్షిణాది నటిగా పేరొందిన ప్రియమణి.. 'ఫ్యామిలీ మ్యాన్', 'అతీత్' వంటి వెబ్‌సిరీస్‌ల్లో నటించి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. షారూక్, దీపికా పదుకొణె నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంలో ఐటెం సాంగ్‌తో అలరించింది. బాలీవుడ్లో పాగా వేయడానికి ప్రస్తుతం సరైన అవకాశం కోసం చూస్తోందీ నటి.
"హిందీ సినిమాల్లో ఏదైనా పాత్రకు నేను సరిపోతానని భావిస్తే చిత్రనిర్మాతలు నన్ను సంప్రదించవచ్చు. బాలీవుడ్లో అడుగుపెట్టడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్టులన్నీ నాకు సంతృప్తిని ఇచ్చాయి".
-ప్రియమణి, కథానాయిక
దక్షిణాది చిత్రాలతో నటిగా గుర్తింపు పొందిన ప్రియమణి.. పలు హిందీ సినిమాల్లోనూ మెరిసింది. బహుభాషా చిత్రాలైన 'రావణ్', 'రక్త చరిత్ర 2'తో పాటు చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ప్రత్యేక గీతంలో నర్తించింది. తాజాగా అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న 'మైదాన్'లో అవకాశం దక్కించుకుంది.
ఇదీ చూడండి.. యూట్యూబ్ వ్యూస్‌లో పోటీపడుతున్న అన్నదమ్ములు