ETV Bharat / sitara

ఆ సినిమా నుంచి తప్పుకున్న అక్షయ్​! - అమిశ్ త్రిపాఠి

స్టార్ హీరో​ అక్షయ్​కుమార్.. పలు కారణాల వల్ల 'సుహేల్​దేవ్' చిత్రాన్ని వదులుకున్నారు. ఇప్పటికే అర డజనుకు పైగా సినిమాలతో బిజీ, డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లే దీని నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.​

After Ajay Devgn, Akshay Kumar turns down Suheldev?
ఆ సినిమాను అక్షయ్​ కూడా వదులుకున్నారు!
author img

By

Published : Dec 26, 2020, 1:24 PM IST

చారిత్రక కథతో తెరకెక్కనున్న 'సుహేల్​దేవ్'​ నుంచి బాలీవుడ్​ హీరో​ అక్షయ్​కుమార్​ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన డేట్స్​ ఖాళీగా లేకపోవడం సహా సృజనాత్మక విభేదాల కారణంగానే ఈ చిత్రాన్ని వదులుకున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ సినిమాలో నటించాల్సిన అజయ్ దేవగణ్​ కూడా పలు కారణాలతో ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేశారు.

ప్రముఖ రచయిత అమిశ్ త్రిపాఠి రాసిన 'లెజెండ్​ ఆఫ్​ సుహేల్​దేవ్'​ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు దర్శకుడు అశ్విన్​. ఇటీవలే దిల్లీ వెళ్లి అక్కీ కథ వినిపించగా, స్క్రిప్ట్​లో ఆయన పలు మార్పులు చేయమన్నారట. భారీ స్థాయిలో కాల్షీట్లు ఇవ్వడం సహా రానున్న రెండేళ్లు పలు ప్రాజెక్టులతో తాను బిజీగా ఉన్న కారణంగా అక్కీ ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది.

అక్షయ్ 'సూర్యవంశీ', 'బెల్​బాటమ్'​ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'పృథ్వీరాజ్', 'అతిరంగీ రే' షూటింగ్​ దశలో ఉన్నాయి. వీటితో పాటు 'రక్షాబంధన్', 'రామ్ సేతు', 'బచ్చన్ పాండే', ప్రియదర్శన్​ దర్శకత్వంలో ఓ కామెడీ థ్రిల్లర్​ సినిమాల్లో అక్కీ నటించాల్సి ఉంది.

ఇదీ చూడండి: మహేశ్​బాబు జెంటిల్మన్.. బాలీవుడ్​ హీరో ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.