క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ అదితిరావు హైదరీ స్పందించింది. తాను కెరీర్లో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే చాకచక్యంగా అందులో నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించింది.
తాజాగా అదితి నటించిన మలయాళ సినిమా 'సుఫియుమ్ సుజాతయుమ్' అమెజాన్లో విడుదలైంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో 'బాలీవుడ్లో లైంగిక వేధింపుల అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం తెలిపింది.
దీంతో పాటు ఆధిపత్య ధోరణి, బెదరింపుల సంస్కృతి కూడా ఉందని తెలిపింది హైదరీ. వీటన్నింటినీ సినీపరిశ్రమ నుంచి పూర్తిగా తరిమిగొట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"చిత్రసీమలో ప్రతిఒక్కరికీ ఇలాంటి అనుభవాలు, ఎదురౌతుంటాయి. బెదిరింపులకు కూడా గురౌతుంటారు. కొంతమంది అందులోనుంచి ఏదోరకంగా తప్పించుకుంటారు. మరికొంతమంది ఆ సమస్యల ఊబిలో ఇరుక్కుంటారు. నేను అదృష్టవశాత్తు బయటపడగలిగాను."
-అదితిరావు హైదరీ, హీరోయిన్.
ముఖ్యంగా కొంతమంది మనల్ని వారి అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారని.. ఆ సమయంలో వారికి ప్రతికూలంగా వ్యవహరిస్తే బెదరింపులకు పాల్పడతారని చెప్పింది హైదరీ. అణగదొక్కడానికి కూడా వెనుకాడరని తెలిపింది. తాను అలా ఉన్నందుకు అవకాశాలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్లో' నటిస్తోంది అదితి. రిభు దశగుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పరిణితి చోప్రా, కీర్తి కుల్హరి కూడా నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
![aditi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7926563_747_7926563_1594109273379.png)
ఇది చూడండి : గ్రామీ అవార్డు గ్రహీత గాయకుడు చార్లెస్ మృతి