'లక్ష్మీకళ్యాణం'తో 2007లో 'లక్ష్మి'గా తెలుగుతెరకు పరిచయమైంది. 'చందమామ'తో అందరిచేత 'మహాలక్ష్మి' అనిపించుకుంది. 'మగధీర'లో 'మిత్రవింద'గా అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసింది. 'ఆర్య2'లో 'గీత'గా కుర్రకారును కవ్వించింది. 'నేనే రాజు నేనే మంత్రి'లో 'రాధ'గా భార్య అనే పదానికి అసలైన అర్థం చెప్పింది.. ఇప్పటికే అర్థమైంది కదా.. ఈ చర్చంతా కాజల్ అగర్వాల్ గురించే అని. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఆమె గతేడాది అక్టోబర్ 30న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహమాడింది కదా.! పెళ్లి తర్వాత చాన్నాళ్లకు తొలిసారిగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.
ఈ ఏడాదిని ఎలా ప్లాన్ చేశారు..?
ఇల్లు, పని.. ఇలా రెండింటిని సమన్వయం చేస్తూ వెళ్లాలనుకుంటున్నా. జీవితంలో ఇంకా పురోగతి సాధించాలి.
మీ వివాహ జీవితం ఎలా ఉంది..? మీ భర్త గురించి ఒక్కమాటలో చెప్పండి.
మా పెళ్లి యాదృచ్ఛికంగా జరిగింది. ఇక మా ఆయన గురించి చెప్పాలంటే.. నా జీవితంలో బెస్ట్‌ఫ్రెండ్, భర్త ఒక్కరే.
మీ మొబైల్ వాల్‌పేపర్..?

సినిమాలు చేయడం కొనసాగిస్తారా..?
కచ్చితంగా.. నా మొదటి ప్రేమ(ఫస్ట్‌లవ్) సినిమా. పితృస్వామ్యవ్యవస్థకు ఇకనైనా స్వస్తి పలుకుదాం.
గౌతమ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది..?
మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా జరిగింది.
మీకు బాగా సంతృప్తినిచ్చే విషయం..?
సెట్లో సీన్ పూర్తికాగానే నా నటనను కెమెరాలో మళ్లీ చూసుకుంటా. అలా చూస్తూ కెమెరా ముందే ఉండిపోతా అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.
మీ నాన్నగారితో ఫొటో..?

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత మీరు గ్రహించిన తేడా..?
బాధ్యతలు పెరగడం. అందరి కంటే నా భర్తకు ప్రాధాన్యత ఇవ్వడం.
మీ రోజు ఎలా మొదలవుతుంది..?
నా ప్రతిరోజు కృతజ్ఞతతో మొదలవుతుంది. మన జీవితంలో ఎదుగుదలకు మనల్ని ప్రోత్సహించిన వాళ్లందరికీ మనం కృతజ్ఞతగా ఉండాలి. ఒక గ్లాసు వేడి నీటిలో అల్లం, పసుపు కలిపి తీసుకుంటా. మహామంత్రం జపిస్తా. 30 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్.
హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తున్నారు..?
ఫిబ్రవరి మధ్యలో..
ఇప్పటి వరకూ పంచుకోని పెళ్లి ఫొటో..?

హనీమూన్ ఎక్కడ జరిగింది..
మాల్దీవులు.
మీకు ఇష్టమైన ఫుడ్..?
అన్ని ఆసియా వంటకాలు.
సౌందర్య సంరక్షణకు ఏం వాడతారు..?
కొబ్బరి నూనె. అలోవెరా.
మీకు కోపం తెప్పించే విషయాలు..?
మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం.
మీ చిన్ననాటి ఫొటో..?

మీ చిన్ననాటి కల..?
వ్యోమగామి. నేను త్వరలో ఒక రాకెట్‌ను నడిపిస్తానని అనుకుంటున్నా.
నిషా అగర్వాల్ గురించి..?
సోల్‌మేట్. లైఫ్‌లైన్.
మీ బాయ్‌ఫ్రెండ్..?
కిచ్లూ. 9 సంవత్సరాల క్రితం దిగిన ఫొటో.

మోసగాళ్లు సినిమాలో మీ పాత్ర..?
హా.. ఆసక్తికరంగా ఉంటుంది. వేచి ఉండాల్సిందే. నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఓవర్ థింకింగ్‌ను ఎలా అధిగమిస్తారు..?
సానుకూల అంశాలపై దృష్టి పెడుతుంటా. యోగా చేస్తాను.
మీకు ఇష్టమైన డ్రింక్..?
నిమ్మరసం. గ్రే టీ
మేకప్ వేసుకోకుండా ఉన్నప్పటి ఫొటో..?
