ETV Bharat / sitara

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సునీల్ - మొక్కలు నాటిన సునీల్

ప్రముఖ హాస్యనటుడు సునీల్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నారు. జూబ్లిహిల్స్​లోని పార్క్​లో మొక్కలు నాటారు.

Actor Sunil completed Green India ChallengeActor Sunil completed Green India Challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సునీల్
author img

By

Published : Nov 9, 2020, 8:28 PM IST

ప్రాణకోటి జీవనాధారానికి అవసరమైన ఆక్సిజన్ కోసం ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలని ప్రముఖ హాస్యనటుడు సునీల్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నటుడు రాజా రవీంద్ర విసిరిన హరిత సవాల్​ను స్వీకరించిన సునీల్.. జూబ్లీహిల్స్​లోని పార్క్​లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పెద్దల మాటలను గుర్తుచేసిన సునీల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మరింత ఉద్ధృతంగా నిర్వహించి దేశాన్ని పచ్చటి వనంలాగా తీర్చిదిద్దాలని కోరారు. అందులో భాగంగా ప్రముఖ నటి సురేఖ వాణితోపాటు 'కలర్ ఫొటో' చిత్రబృందానికి మొక్కలు నాటాలని సునీల్ హరిత సవాల్ విసిరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.