కరోనా బారినపడి అనారోగ్యానికి గురైన సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. క్లిష్ట పరిస్థితుల నుంచి ఆయన బయటపడ్డారని పేర్కొంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
"ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆయనకు వెంటిలేటర్ చికిత్స నిలిపివేశాం. ప్లాస్మా థెరపీ అందించాం. ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారు. ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం."
-ఆస్పత్రి వర్గాలు
రాజశేఖర్ సతీమణి జీవిత కూడా కరోనాతో ఇదే ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం మరోసారి పరీక్షించగా నెగిటివ్ రిపోర్ట్ రావడం వల్ల శనివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు.