కరోనా విజృంభణతో దేశంలో విధించిన లాక్డౌన్ కారణంగా వ్యాపార రంగాలతో పాటు, సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని చిత్రీకరణలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ కారణంగా సినీ తారలంతా ఇళ్లకే పరిమిమతమయ్యారు. ఈ విరామంలోనే సామాజిక మాధ్యమాల్లో వారంతా అభిమానులను పలకరిస్తున్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు అల్లరి నరేశ్ ఇన్స్టా వేదికగా ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన 'సుడిగాడు', 'కితకితలు' సీక్వెల్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'సుడిగాడు' సీక్వెల్ తీయాలన్న ఆలోచన ఉంది. కానీ, ఇందుకు కొనసాగింపు అంటే ఆ కథ తొలి భాగాన్ని తలదన్నేలా ఉండాలి. అలాంటి కథ దొరికితే కచ్చితంగా 'సుడిగాడు 2' చేస్తా. 'కితకితలు' సినిమాకు సీక్వెల్ చేయలన్న దానిపై అంత సీరియస్‌గా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ, సరదాగా 'పకపకలు' అని ఓ ప్రయోగాత్మక కథ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఉండేది. కానీ, అది ఎంత వరకు సాధ్యమవుతుంది? అన్న విషయంపై ఇంత వరకు ఆలోచన చెయ్యలేదు."
-అల్లరి నరేశ్, సినీ నటుడు
ప్రస్తుతం నరేశ్ 'నాంది' అనే ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. దీంతో పాటు 'బంగారు బుల్లోడు' చిత్రాన్నీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది వేసవి కానుకగా సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">