ETV Bharat / sitara

నాకు అది అరేంజ్డ్​ మ్యారేజ్​: శ్రుతి హాసన్​

సినిమాల్లోకి తన ప్రయాణం అనుకోకుండా జరిగిందని తెలిపింది కోలీవుడ్​ భామ శ్రుతి హాసన్. తన 12 ఏళ్ల సినీ జీవితంపై స్పందించిన ఈ నటి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Shruti hassan
శ్రుతి హాసన్
author img

By

Published : Aug 13, 2021, 5:30 AM IST

Updated : Aug 13, 2021, 7:08 AM IST

హీరోయిన్ శ్రుతి హాసన్.. 12 ఏళ్ల తన సినీ కెరీర్​ గురించి మాట్లాడింది. తండ్రి కమల్​ హాసన్​ చిత్రం ద్వారా చైల్డ్​ ఆర్టిస్ట్​గా ఫిల్మ్​ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2009లో బాలీవుడ్​ చిత్రం 'లక్'​ మూవీ ద్వారా కథానాయికగా పరిచయమైంది. అనంతరం తెలుగు, తమిళ సినిమాల్లోనూ తనను తాను నిరూపించుకుంది.

సినీ ప్రయాణం ఎలా ఉంది?

సినిమాల్లోకి తన ప్రవేశం అనుకోకుండా జరిగిందని శ్రుతి తెలిపింది. హీరోయిన్​గా రాకముందు తన దృష్టంతా రాక్​ బ్యాండ్​పైనే ఉండేదని వెల్లడించింది. అయితే ఇందుకు కావాల్సిన డబ్బులు 'లక్' సినిమా ద్వారా సమకూర్చుకున్నానని పేర్కొంది.

తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని శ్రుతి గుర్తు చేసుకుంది. 'జానె తూ.. యా జానె నా' సినిమా కోసం ఇమ్రాన్​ ఖాన్​ తనను సంప్రదించాడని తెలిపింది. ఇమ్రాన్ ఆ సినిమా​ స్క్రిప్ట్​ చెప్తుండగా తాను విన్నట్లు నటించానని.. నిజానికి తన దృష్టంతా వేరే విషయంపై ఉందని (నవ్వుతూ) పేర్కొంది.

సినిమాలపై అప్పటివరకు అంతగా ఆసక్తి లేదని వెల్లడించింది. అనుకోకుండా హీరోయిన్​గా ప్రయాణం మొదలైందని ఈ భామ చెప్పుకొచ్చింది. నటిగా నా ప్రయాణం ఓ అరేంజ్డ్​ మ్యారేజ్​ లాంటిది. చాలా చిన్నచిన్నగా మొదలైంది. రాను రానూ ఈ బంధం దృఢంగా మారింది. అసలు తన కెరీర్​ సంగీతంతో ముడిపడి ఉందని తెలిపింది. ఈ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇంతవరకు సరైన అవకాశం రాలేదని శ్రుతి పేర్కొంది.

'సలార్'​ ఎలా ఉంది..

ఇది ప్రతిష్టాత్మక చిత్రం. నేను సీరియస్​గా చెబుతున్నా. నా జీవితంలో చాలా సినిమా సెట్​లను చూశా. కానీ, 'సలార్'​ సెట్​లోకి వెళ్లినప్పుడు.. ఇది కచ్చితంగా భారీ నిర్మాణాల జాబితాలో చేరుతుందనిపించింది. దర్శకుడు ప్రశాంత్​ నీల్​ దృష్టి చాలా స్పష్టంగా, సహజంగా ఉంటుంది.

ప్రభాస్​ గురించి..

అతడు చాలా స్వీటెస్ట్ పర్సెన్. తనను తాను అర్థం చేసుకుంటాడు. సెట్​లో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. హైదరాబాద్​లో షూటింగ్​లో పాల్గొనేటప్పుడు తమ ఇంటి నుంచి భోజనం పంపాల్సిందిగా శ్రుతి కోరిందట. అందుకు బదులుగా షూటింగ్​లో ఉన్నన్ని రోజులు వేల సంఖ్యలో డిష్​లు పంపించాడు. వాటితో 'బాహుబలి' టీమ్​కు మొత్తం భోజనాలు పెట్టొచ్చు (నవ్వుతూ).

ఇదీ చదవండి: 'దేశముదురు' భామ అన్ని సినిమాల్లో నటిస్తుందా?

Last Updated : Aug 13, 2021, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.