ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భారతీయుడు 2'. ఇందులో సేనాపతి పాత్రలో నటిస్తున్నాడు లోకనాయకుడు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను కమల్ చేయట్లేదని సినీ వర్గాల్లో సమాచారం. కమల్‌హాసన్ తరఫున వేరొకరితో ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
ఇటీవల కమల్ కాలుకి చికిత్స చేశారు. డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అందుకోసం స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ బృందంలోని ఓ ఫైటర్ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఆ ఫైటర్‌పై తీయనున్నారని సమాచారం.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ మూవీలో కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, వెన్నెల కిశోర్ తదితరలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2021 ఏప్రిల్14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: ఐరన్మ్యాన్లా ఉన్నానట: బాలకృష్ణ