ఏప్రిల్... వేసవి సెలవుల ఈ నెల నుంచే ప్రారంభమౌతాయి. పిల్లలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతకంటే మంచి సీజన్ ఏముంటుంది సినిమాలకు? గత మూడేళ్ల నుంచి మూడు చిత్రాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదలై వసూళ్ల వర్షం కురిపించాయి. బాహుబలి 2, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ చిత్రాలు ఒకే నెలలో ఒక్కో రోజు తేడాతో విడుదలయ్యాయి.
2017 ఏప్రిల్ 28న విడుదలైంది బాహుబలి 2 చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 2 వేల కోట్ల కలెక్షన్లు సాధించింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుకెక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2018 ఏప్రిల్ 27న విడుదలైంది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం. గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. 400 మిలియన్ డాలర్లతో(2 వేల 700 కోట్లు) తెరకెక్కిన ఈ చిత్రం 2 బిలియన్ డాలర్లు(రూ. 13వేల కోట్లు) పైగా వసూల్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2019 ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది అవెంజర్స్ ఎండ్ గేమ్. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇన్ఫినిటీవార్ కంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యాధృచ్ఛికంగా మూడేళ్ల నుంచి ఒకే నెలలో ఒక్కో రోజు తేడాతో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీలు సృష్టించాయి ఈ మూడు చిత్రాలు.