చైనాకు చెందిన షియోమీ(Xiaomi).. జోరు పెంచింది. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్ గ్యాడెట్స్తో వరుసగా లాంచ్‌లకు ముహుర్తం పెట్టుకుంది. ఈ నెలలో దేశీయ మార్కెట్లోకి ఎంఐ నోట్‌బుక్స్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. అటు షియోమీకి చెందిన మరో బ్రాండ్ రెడ్మీ(Redmi) కూడా రానున్న వారాల్లో కొత్త లాప్‌టాప్స్‌తో వినియోగదారులను పలకరించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంఐ లాప్టాప్ ప్రో(Mi laptop pro) ఈ నెలలో విడుదలయ్యే అవకాశముంది. అయితే దీనిపై సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
ఎంఐ లాప్టాప్ ప్రో 14 ఫీచర్స్ (Mi laptop pro 14 features)
- 14 అంగుళాల డిస్ప్లే
- ఇంటెల్ 11 జెనరేషన్ కోర్ ప్రాసెసర్
- జీఫోర్స్ ఎంఎక్స్ 450 గ్రాఫిక్ కార్డ్
- 65డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ
భారత్‌లో గేమింగ్ లాప్టాప్స్ను కూడా విడుదల చేసేందుకు షియోమీ సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.
రెడ్మీ నోట్ 10టీ 5జీ (Xiaomi Redmi Note 10T 5G)
రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో ఈ ఏడాది ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది షియోమీ. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే రెడ్మీ నోట్ 10టీ 5జీ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. దీనిపై రెడ్మీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంకేతాలు కూడా ఇచ్చింది. ఇది రష్యాలో ఇప్పటికే అందుబాటులో ఉంది.
ఫీచర్స్ (Xiaomi Redmi Note 10T 5G features)
- 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ల్‌ప్లే
- ఆక్టా కోర్ మీడియాటెక్ డామెన్సిటీ 700 ప్రాసెసర్
- 4జీబీ ర్యామ్- 64జీబీ/ 128జీబీ స్టోరేజీ
- 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 11
- వెనకవైపు 48ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ కెమెరా
- ధర అంచనా.. సుమారు రూ. 20,550
ఈ ఫోన్ విడుదలయ్యే అధికార తేదీని సంస్థ ఇంకా ప్రకటించలేదు.
ఇదీ చూడండి:- అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ వాచ్ రివోల్వ్ యాక్టివ్