ETV Bharat / science-and-technology

బైపీసీ తర్వాత బీఎస్సీలో ఏ సైన్స్​ ఎంచుకుంటే బాగుంటుంది..? - హోమ్‌ సైన్స్‌

ఇంటర్‌లో బైపీసీ తర్వాత బీఎస్సీలో ఏ సైన్స్‌ ఎంచుకుంటే బావుంటుందో అనే ఆలోచన విద్యార్థులందరికీ ఉండేదే. అభిరుచి, ఆసక్తికి అవగాహన తోడైతేనే సరైన ఎంపిక సాధ్యం. అందుకే మొక్కలు, జంతువులూ, రసాయనాలూ, పదార్థాల గురించి అధ్యయనం చేసే లైఫ్‌ సైన్స్‌.. ఇంట్లో తినే ఆహారం, ఇతర విషయాల గురించి చదివే హోమ్‌ సైన్స్‌ (కొత్త పేరు: కమ్యూనిటీ సైన్స్‌) గురించి విపులంగా తెలుసుకుందామా!

Which science would be better to choose in BSc after BPC ..?

author img

By

Published : Apr 14, 2022, 9:00 AM IST

రకరకాల మొక్కలు, జంతువులు, వైరస్‌, బ్యాక్టీరియా, కణాల గురించి అధ్యయనం చేయడాన్నే లైఫ్‌ సైన్స్‌ అంటున్నాం. మూడేళ్ల డిగ్రీలో ప్లాంట్‌ బయాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, జువాలజీ, ఫుడ్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్‌ సైన్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయోఇన్‌ఫర్మేటిక్స్‌ వంటి పలు సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు మాస్టర్స్‌, పీహెచ్‌డీ దాకా చదువును కొనసాగించవచ్చు.

* డిగ్రీ అర్హతతో పాథాలజిస్ట్‌, న్యూట్రిషనిస్ట్‌, హార్టికల్చరిస్ట్‌, ఫుడ్‌ సైంటిస్ట్‌గా ఉద్యోగాల్లో స్థిరపడొచ్ఛు కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు మినహా మిగతా అన్నీ ఇంటర్‌ మెరిట్‌తో నేరుగా డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివి, 50 శాతం మార్కులతో పాసై ఉన్నవారు అర్హులు. ఆపై బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంబీఏ, డిప్లొమా వంటి కోర్సులు చదువుకోవచ్చు.

...

* ఫార్మా, తయారీ రంగాల్లో వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు ఎమ్మెస్సీ, రిసెర్చ్‌ వైపునకే కాకుండా, ఎంబీఏ ఎంచుకుని మేనేజ్‌మెంట్‌వైపు కూడా వెళ్లొచ్ఛు కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, బయాలజీలో మాస్టర్స్‌ చేయొచ్చు.

* బయోకెమిస్ట్‌, బయోఫిజిసిస్ట్‌, మెడికల్‌ సైంటిస్ట్‌, హైడ్రాలజిస్ట్‌, మెటీరియల్‌ సైంటిస్ట్‌లకు అత్యధిక వేతనాలందుకునే అవకాశముంది. సాధారణ లైఫ్‌ సైన్స్‌ డిగ్రీతో పోలిస్తే.. స్పెషలైజేషన్‌ లైఫ్‌సైన్స్‌కే ప్రాధాన్యం ఎక్కువ.

* ఇంటర్‌ తరువాత ఎంబీబీఎస్‌లాంటి సంప్రదాయ డిగ్రీతో పోలిస్తే అందుకయ్యే ఫీజులు, కాలవ్యవధి కన్నా మూడేళ్లలో పూర్తయ్యే లైఫ్‌ సైన్స్‌ కోర్సు సులువైనదని చెప్పొచ్ఛు ఈ లైఫ్‌ సైన్స్‌ను కెరియర్‌గా ఎంచుకున్నవారికి బయోటెక్నాలజీలో స్పెషలైజేషన్‌కు అత్యధిక డిమాండ్‌ ఉంది.

హోమ్‌ సైన్స్‌..

...

ఇంటి నిర్వహణ, అలంకరణ, రోజువారీ తీసుకునే ఆహారం, అందులో లభించే పోషకాల గురించి చదవడాన్నే హోమ్‌ సైన్స్‌ అంటున్నాం. మూడేళ్ల బీఏ, బీఎస్సీ డిగ్రీలో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌, హోమ్‌ ఎకనమిక్స్‌, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ ప్రాసెసింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ చదువుకోవచ్చు.

* కమ్యూనిటీ సైన్స్‌/ హోం సైన్స్‌లో మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ కోర్సు పూర్తిచేసుకోవచ్ఛు అనంతరం ఎమ్మెస్సీ, ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా విద్య కొనసాగించవచ్చు. కొన్ని సంస్థలు వొకేషనల్‌ బీఏలో భాగంగానూ హోం సైన్స్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంటుంది. (బీఎస్సీ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ అనేది హోమ్‌ సైన్స్‌లో ఒక బ్రాంచ్‌ మాత్రమే. ఇందుకు సంబంధించిన సబ్జెక్టులు వేరుగా ఉంటాయి.

* విద్య, ఆతిథ్య రంగం, పర్యటకం, వైద్య సంస్థలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఆహార పరిశ్రమల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఎక్కువ.

* కొన్ని యూనివర్సిటీలు/కళాశాలలు ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా అడ్మిషన్లు అందిస్తాయి. ఫుడ్‌ అనలిస్ట్‌, హెల్త్‌కేర్‌ కౌన్సెలర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, మెడికల్‌ కోడర్‌, ప్రొఫెసర్‌.. వంటి ఉన్నతస్థాయి ఉద్యోగావకాశాలు. హోటళ్లు, ఆసుపత్రులు, న్యూట్రిషన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్లు, హెల్త్‌ క్లబ్‌లు, జిమ్‌ తదితర చోట్ల చక్కని కెరియర్‌ ఉంటుంది.

ఏమేం ఉండాలంటే: కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆర్గనైజేషనల్‌ స్కిల్స్‌, సమయపాలనతోపాటు సబ్జెక్టుపై పట్టు ఉంటే కెరియర్‌లో చక్కగా రాణించగలుగుతారు.

ఆచార్య ఎన్‌జీ రంగా, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పలు కళాశాలలు యూజీ, పీజీ స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.