ETV Bharat / science-and-technology

వాట్సాప్​ యూజర్స్​ తెలుసుకోవాల్సిన టాప్​-5 హిడెన్​ ఫీచర్స్​ ఇవే! - వాట్సాప్​ హిడెన్ ఫీచర్స్

WhatsApp Hidden Features In Telugu : మీరు వాట్సాప్ యూజర్లా? బెస్ట్ వాట్సాప్ ఫీచర్స్​ గురించి తెలుసుకోవాలా? అయితే ఇది మీ కోసమే. వాట్సాప్ యూజర్లు అందరూ తెలుసుకోవాల్సిన టాప్​-5 హిడెన్ ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp features
WhatsApp hidden features
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 5:11 PM IST

WhatsApp Hidden Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్​ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. వాటిలోని టాప్​-5 హిడెన్ ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. WhatsApp Video Call Screen Sharing Feature : వాట్సాప్​లో వీడియో కాల్​ చేసేటప్పుడు, స్క్రీన్​ దిగువ భాగంలో 'Share' ఐకాన్​ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే స్క్రీన్​ షేరింగ్ యాక్సెస్​ పర్మిషన్స్ అడుగుతుంది. మీరు దానిని కూడా ఓకే చేస్తే, వెంటనే మీరు ఎవరెవరికి స్క్రీన్​ చేయాలనుకుంటున్నారో, వారందిరికీ లైవ్​లో మీ స్క్రీన్​ కనిపిస్తుంది. స్క్రీన్ షేరింగ్ ఫర్​ వీడియో కాల్స్ ఫీచర్​, ల్యాండ్​ స్కేప్​ మోడ్​లో కూడా పనిచేస్తుంది. దీని వల్ల వాట్సాప్ యాప్​ను​ డెస్క్​టాప్​లో ఉపయోగించినప్పుడు, మంచి వ్యూయర్ ఎక్స్​పీరియన్స్​ కలుగుతుంది. ఈ వాట్సాప్​ ఫీచర్​ను గ్రూప్​​ కాల్స్​లోనూ ఉపయోగించవచ్చు. అందువల్ల ఇకపై ఆఫీషియల్ మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ మీట్​, జూమ్ లాంటి యాప్స్ వాడాల్సిన అవసరం ఉండదు.

2. WhatsApp Short Video Message Feature : ఈ షార్ట్ వీడియో ఫీచర్​ అనేది రియల్​టైమ్​ వాయిస్​ మెసేజ్ ఫీచర్​లానే పనిచేస్తుంది. టెక్ట్స్​ బాక్స్​ పక్కనే వీడియో రికార్డింగ్ ఐకాన్ ఉంటుంది. దీనిని ఉపయోగించి 60 సెకెన్ల నిడివితో వీడియో మెసేజ్​ను రికార్డ్​ చేసి, తరువాత వాటిని మెసేజ్ రూపంలో ఇతరులకు పంపించవచ్చు.

3. WhatsApp One Time Voice Message Feature : వాట్సాప్​లో మీరు పంపాలనుకున్న సున్నితమైన సమాచారాన్ని వన్​-టైమ్​ లిజన్​ వాయిస్​ మెసేజ్​ ఫీచర్​ ద్వారా వాయిస్​ మెసేజ్​ రూపంలో ఎటువంటి భయం లేకుండా పంపుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ ద్వారా మీరు పంపే వాయిస్​ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్​ లేదా షేర్​ చేయడం, సేవ్​ చేసుకోవడం, స్టార్​ చేయడం, రికార్డ్ చేయడం కుదరదు. తద్వారా ఈ పైవాటిలో దేని ద్వారా కూడా మీరు భవిష్యత్​లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడదు.

4. WhatsApp Secret Code feature For Chats : వాట్సాప్​లో 'సీక్రెడ్​ కోడ్​' అనే ఫీచర్​ ఉంది. దీనిని ఉపయోగించి మీ పర్సనల్ చాట్​లను లాక్​ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు లాక్​ చేసుకున్న చాట్స్​ మరెవరికీ కనబడకుండా చేసుకోవచ్చు. దీని వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉంటుంది.

5. WhatsApp AI Stickers : స్టిక్కర్లు క్రియేట్ చేసేవారి కోసం వాట్సాప్​ తీసుకువచ్చిన ఫీచర్​​ ఇది. దీనితో మీరు సొంతంగానే వాట్సాప్​ స్టిక్కర్​లను క్రియేట్​ చేసుకోవచ్చు. దీని కోసం వాట్స్​ప్​లోని స్టిక్కర్​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. తరువాత క్రియట్​ బటన్​ని క్లిక్ చేయాలి. వెంటనే మీకు సెర్చ్​ బార్​ కనిపిస్తుంది. అందులో మీకు నచ్చిన స్టిక్కర్​లను సొంతంగానే క్రియేట్​ చేయవచ్చు.

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

యూట్యూబ్​ యూజర్లు తెలుసుకోవాల్సిన టాప్​-5 హిడెన్ ఫీచర్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.