ETV Bharat / science-and-technology

వాట్సాప్‌లో 'మెసేజ్' ఎడిట్ ఫీచర్!.. 15 నిమిషాల్లోపే ఛాన్స్​.. ఆ తర్వాత? - వాట్సాప్​ మెసేజ్​ ఎడిట్​

Whatsapp Edit Message : అప్పుడప్పుడు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపేటప్పుడు అక్షర దోషాలు, టైపోలు జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ తమ యూజర్లకు ఎడిట్​ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Whatsapp Edit Message Feature
Whatsapp Edit Message Feature
author img

By

Published : May 15, 2023, 10:56 AM IST

Whatsapp Edit Message Feature : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడే సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లలో వాట్సాప్ ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్​ఫోన్​లో ఈ యాప్​ కచ్చితంగా ఉంటుంది! 2009లో ప్రారంభమైన ఈ ఆన్​లైన్​ ఇన్​స్టంట్ మెసేజింగ్ యాప్.. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది. తర్వాత ఈ యాప్​ను ఫేస్​బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్​బర్గ్​ కొనుగోలు చేశారు. అయితే వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. తాజాగా మరో సూపర్​ ఫీచర్​ అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాధారణంగా వాట్సాప్​లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు టైప్ చేస్తుంటే అక్షర దోషాలు వస్తుంటాయి. అవి చూసుకోకుండా సెండ్ బటన్ మీద క్లిక్ చేసి మనం పంపించేస్తాం. ఆ తర్వాత చూసుకుని అరెరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని డిలీట్ చేయడమో లేక దాని తర్వాత సరిచేసి వేరే మెసేజ్ టైప్​ చేసి పంపుతాం. అదే మెసేజ్​ కాస్త పెద్దదైతే మళ్లీ టైప్ చేయలేక కాపీ చేసి దాన్నే సరిచేసి పంపుతాం. ఇంత ప్రాసెస్ అవసరమా? అదే మెసేజ్​ను ఎడిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంటుంది.

అయితే పంపిన మెసేజ్​ను ఎడిట్ చేసే ఫీచర్​ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పొరపాటున తప్పుగా మెసేజ్ పంపినా ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది​. ఈ ఏడాది ప్రారంభంలో డెవలపర్లు ఈ ఫీచర్​ను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపించిన 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే విధంగా సరికొత్త ఫీచర్​ను టెస్ట్ చేసినట్లు సమాచారం.

వాట్సాప్ బేటా వెర్షన్​లో ఈ ఫీచర్​ను టెస్ట్ చేసినట్లు 'వాట్సాప్ బేటా ఇన్ఫో' అనే వెబ్​సైట్ వెల్లడించింది. వాట్సాప్ వెబ్ బేటా వెర్షన్ ఈ ఫీచర్​ను పొందిన కొన్ని రోజులకే కొంతమంది వినియోగదారులు ఆండ్రాయిడ్ 2.23.10.13 వెర్షన్స్​లో చాట్స్, గ్రూప్స్​లో పంపిన సందేశాలను ఎడిట్ చేయగలుగుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వెబ్ సైట్​లో ఉంది. ఈ స్క్రీన్ షాట్​ను గమనిస్తే.. పంపిన మెసేజ్​ను సెలెక్ట్ చేస్తే.. కుడి వైపున పైన ఇన్ఫో, కాపీ, ఎడిట్ అనే ఆప్షన్స్ కనపడతాయి. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మెసేజ్​ను ఎడిట్ చేయవచ్చు.

ఈ ఫీచర్​ ద్వారా మనం ఎన్నిసార్లు అయినా సందేశాన్ని సవరించుకోవచ్చు.. కానీ మెసేజ్​ పంపిన 15 నిమిషాల లోపే చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ అందుకు అనుమతించదు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం మెసేజ్​లను మాత్రమే ఎడిట్ చేసుకునేలా ఈ ఫీచర్​ను వాట్సాప్​ రూపొందించింది. భవిష్యత్తులో ఈ ఫీచర్​ను మరింత అప్డేట్​ చేసే అవకాశం ఉంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.