ETV Bharat / science-and-technology

వాట్సాప్​ చాట్​ బ్యాకప్ చేస్తున్నారా? ఇకపై డబ్బులు కట్టాల్సిందే!

Whatsapp Backup In Google Drive Premium : ఇక నుంచి వాట్సాప్ చాట్​ బ్యాకప్​ చేయడానికి డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే ఇంతవరకు 5జీబీ వాట్సాప్​ బ్యాకప్ ఫ్రీగా చేసుకున్నా.. మరికొద్ది రోజుల్లో గూగుల్​కు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి వాట్సాప్ బ్యాకప్​కు ప్రీమియం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 5:01 PM IST

Whatsapp Backup In Google Drive Premium : ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్​​.. 15 జీబీ వరకు ఉచిత క్లౌడ్ బ్యాకప్​ను ప్రస్తుతం ఇస్తుంది. అది కాకుండా వాట్సాప్ చాట్ బ్యాకప్​కు 5జీబీ అదనంగా ఇస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం వాట్సాప్​ బ్యాకప్​తో కలిపి మొత్తం 15 జీబీ డేటానే గూగుల్​ డ్రైవ్​లో స్టోర్ చేసుకునే అవకాశం కల్పించబోతోంది. అంతకన్నా ఎక్కువ చాట్​ బ్యాకప్ అయితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ బీటా వినియోగదారులు ప్రీమియం చెల్లిస్తున్నారు. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కూడా 15జీబీ బ్యాకప్ దాటితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది.

గూగుల్​ డ్రైవ్​లో ఒక్కో అకౌంట్​కు 15 జీబీ స్టోరేజ్​ను ఉచితంగా అందిస్తుంది ఆ సంస్థ. ఈ స్టోరేజ్​లోనే జీమెయిల్​, గూగుల్ ఫొటోలు వంటివి బ్యాకప్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులు.. గూగుల్ వన్​ సభ్యత్వాన్ని తీసుకోవాలని అలర్ట్​లు ఇస్తోంది. గూగుల్​ వన్​ను సభ్యత్వాన్ని తీసుకునేందుకు నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1300 చెల్లించాలి. అప్పుడు గూగుల్​ 100 GB క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది.

గ్రూప్​ కాల్స్ కోసం వాయిస్​ చాట్స్​​..
Whatsapp New Voice Chat Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్​ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా వాయిస్‌ చాట్స్‌ సదుపాయాన్ని ప్రారంభించింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు ఈ వాయిస్‌ చాట్స్‌ ఫీచర్‌ను రోల్‌ అవుట్‌ చేసినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలుసా?

సాధారణంగా వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌ వస్తే.. గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్‌ వస్తుంది. ఏ మీటింగ్‌లోనో ఉన్నప్పుడు ఇలా గ్రూప్‌ కాల్‌ వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ వాట్సాప్‌ వాయిస్‌ చాట్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో వాట్సాప్‌ నుంచి గ్రూప్‌ కాల్స్‌ వస్తే ఎలాంటి రింగ్‌ రాదు. గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్‌ నోటిఫికేషన్‌ మాత్రమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్‌ చాట్‌లో పాల్గొనాలనుకొనే వారు కాల్‌ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్‌ అవ్వవచ్చు.

గ్రూప్స్‌లో ఈ వాయిస్‌ చాట్‌ సాయంతో 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కాల్‌ కట్‌ అవుతుంది. కాల్‌లో జాయిన్‌ అయిన వ్యక్తులు మాత్రమే సంభాషణల్ని వినటానికి వీలుంటుందని వాట్సప్‌ పేర్కొంది. వాయిస్‌ చాట్‌లో పాల్గొనని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడవచ్చని తెలిపింది. ఇందులోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. గ్రూప్ చాట్​లో పైన కుడివైపున్న వేవ్‌ఫార్మ్ ఐకాన్‌పై క్లిక్‌ చేసి వాయిస్ చాట్ ప్రారంభించవచ్చని వాట్సాప్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ 33మందికిపైగా సభ్యులున్న గ్రూపులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్‌ ప్రకటించింది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

ఈజీగా స్క్రీన్​షాట్స్..
Youtube Save Frame Feature : ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అన్ని రకాల వీడియోల కంటెంట్ అందిస్తుంది. దీనిని వెబ్, డెస్క్‌టాప్ యాప్ లేదా మొబైల్ డివైజ్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇప్పుడు యూట్యూబ్ వీడియో నుంచి స్టిల్ ఇమేజ్‌ను క్యాప్చర్ చేయాలనుకుంటే, చాలా కష్టపడాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్స్‌తో యూజర్లు స్క్రీన్‌షాట్లు తీసుకోగలుగుతున్నారు. కానీ ఆ పక్రియ కష్టంగా అనిపిస్తుంది. ఇమేజ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అయితే త్వరలో యూట్యూబ్ తీసుకురానున్న ఒక ఫీచర్‌తో కొన్ని వెబ్ బ్రౌజర్లలో యూట్యూబ్‌ వీడియోలోని ఏదైనా ఫ్రేమ్‌ను స్క్రీన్‌షాట్ తీయడం సులభమవుతుంది. ఎందుకంటే కొత్త ఫీచర్‌తో సింగిల్ క్లిక్‌తో స్క్రీన్‌షాట్ సేవ్ చేసుకోవచ్చు. స్క్రీన్​షాట్​ను తీసుకోవడాన్ని సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను 'సేవ్ ఫ్రేమ్' అని పిలుస్తారు. దీనితో యూట్యూబ్ వీడియోపై రైట్-క్లిక్ చేసి, ప్రస్తుత ఫ్రేమ్‌ను ఇమేజ్‌గా సేవ్ చేయవచ్చు. క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి బ్రౌజర్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మీ ​ఫోన్​లో QR స్కానర్ పనిచేయట్లేదా? సింపుల్ ట్రిక్స్​​తో సెట్​ చేయండిలా!

ఆ G-MAIL ఖాతాలు డిలీట్- మీ అకౌంట్​ను తొలగించకుండా చూసుకొండి ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.