ETV Bharat / science-and-technology

ఈ వెబ్‌సైట్లు చూశారంటే.. ఔరా అనాల్సిందే!

తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఈ సినిమా డైలాగ్ ఇప్పుడు ఎందుకు అంటారా. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనకు తెలియని బోలెడు విషయాలున్నాయి. కొత్తగా ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అలా మీకు తెలియని.. ఉపయోగకరమైన కొన్ని వెబ్‌సైట్ల గురించి చెప్పబోతున్నాం. మరి ఆ వెబ్‌సైట్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

websites
వెబ్‌సైట్లు
author img

By

Published : Nov 6, 2021, 9:57 AM IST

ఇంటర్​నెట్ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వెబ్​సైట్‌లు ఉన్నాయని అంచనా. వీటిలోనుంచి దైనందిన జీవితంలో ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు ఏంటి అనేవి కనుగొనడం అంత సులువేమీ కాదు. ఈ నేపథ్యంలో ఆయా సమాచారాన్ని ఉత్తమంగా అందిస్తూ.. బాగా ప్రాచుర్యం పొందిన అత్యంత ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు ఏంటో ఓసారి చూద్దాం..

విండోస్‌ స్వాప్‌.కామ్‌ (windowsswap.com)

useful websites
విండోస్‌ స్వాప్‌.కామ్‌

ఈ వెబ్‌సైట్ సాయంతో మనం ఇంట్లోనే ఉండి ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ప్రదేశాలను నేరుగా చూస్తున్న అనుభూతి పొందొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఓపెన్ ఏ న్యూ విండో సమ్‌వేర్ ఇన్‌ ది వరల్డ్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే వివిధ దేశాల్లోని నగరాల్లో ఉండే ఓ ఇంటి కిటికీ కనిపిస్తుంది. అందులోంచి ఆ ప్రాంతంలోని బయటి దృశ్యాలు కనిపిస్తాయి.

ఈజ్‌ఇట్‌డౌన్‌రైట్‌నౌ.కామ్‌ (isitdownrightnow.com)

useful websites
ఈజ్‌ఇట్‌డౌన్‌రైట్‌నౌ.కామ్‌

కొద్దిరోజుల క్రితం ప్రపంవ్యాప్తంగా వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్‌కి చెందిన ఇతర మెసేజింగ్ యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది యూజర్లకు తమ డివైజ్‌లలో పనిచేయడంలేదా, ఇతరులు కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారా అనే అనుమానం కలిగింది. ఇలాంటి సందర్భాల్లో ఈజ్‌ఇట్‌డౌన్‌రైట్‌నౌ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అందులో ఏయే వెబ్‌సైట్లు పనిచేయంలేదనే జాబితా కనిపిస్తుంది. దాన్నిబట్టి సమస్య మీ ఒక్కరిదా లేదా ఇతర యూజర్లకు కూడా పనిచేయడంలేదా అనేది తెలుసుకోవచ్చు.

గ్రీన్‌ప్రాంక్.కామ్‌ (greenprank.com)

useful websites
గ్రీన్‌ప్రాంక్.కామ్‌

ఇదొక ప్రాంక్ వెబ్‌సైట్‌. మీరు ఎవరితోనైనా సరదాగా ప్రాంక్ చేయాలనుకుంటే ఈ వెబ్‌సైట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ కంప్యూటర్‌లో గీక్‌ప్రాంక్‌ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అందులో విండోస్‌ క్రాష్ అయినట్లు, హ్యాకింగ్ స్క్రీన్‌ వంటి వివిధ రకాల టూల్స్‌ ఉంటాయి. వీటితో మీ నచ్చిన వారి సిస్టమ్‌తో ప్రాంక్‌ చేయొచ్చు. అంటే మీ స్నేహితుడి పీసీలో గీక్‌ప్రాంక్‌ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆ సిస్టమ్‌ హ్యాక్ అయినట్లు, ఫోన్ స్క్రీన్‌షాట్ , జురాసిక్ పార్క్‌ వంటి టూల్స్ ఎన్నో ఉంటాయి.

సేమైన్‌.కామ్‌ (saymine.com)

useful websites
సేమైన్‌.కామ్

ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆన్‌లైన్ వేదికగా ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని పొందాలంటే ముందుగా మనకు సంబంధించిన పేరు, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు తప్పనిసరి. అయితే మన ఈ-మెయిల్‌ ఐడీ గురించిన సమాచారం ఏయే కంపెనీల వద్ద ఉందనేది ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సేమైన్‌ ఓపెన్‌ చేసి అందులో మీ మెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. తర్వాత సైట్‌లో సూచనలు అనుసరిస్తే మీ మెయిల్‌ ఐడీ ఏయే కంపెనీల వద్ద ఉందనే జాబితా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆ కంపెనీ నుంచి మీ వివరాలను తొలగించాలనుకుంటే క్లెయిమ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సెండ్ రిక్వెస్ట్‌పై క్లిక్‌ చేస్తే మీ వివరాలు తొలగించమని సేమైన్‌ సదరు వెబ్‌సైట్లను కోరుతుంది. అలా జాబితాలో ఉన్న ప్రతి వెబ్‌సైట్‌ నుంచి మీ మెయిల్ వివరాలను తొలగించమని కోరవచ్చు.

123యాప్స్‌.కామ్‌ (123apps.com)

useful websites
123యాప్స్‌.కామ్‌

వీడియో ఎడిటింగ్ చేసే వారికోసం ఈ వెబ్‌సైట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ కొనాలంటే ఖరీదైన వ్యవహారం. ఒకవేళ ఆన్‌లైన్‌లో వీడియో ఎడిట్ చేసినా చివర్లో వాటర్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే 123యాప్స్‌లో అన్ని రకాల ఆడియో, వీడియో ఎడిటింగ్ టూల్స్‌తోపాటు, ఫీడీఎఫ్‌ నుంచి ఎక్సెల్‌, వర్డ్‌ నుంచి పీడీఎఫ్‌కి ఫైల్స్‌ని మార్చుకోవచ్చు. అలానే వీడియో ఎడిటింగ్ పూర్తయి సేవ్ చేసేప్పుడు వాటర్ మార్క్ రాదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.