ETV Bharat / science-and-technology

ట్విట్టర్​ యూజర్స్​కు షాక్​.. పోస్టు​లపై మస్క్ లిమిట్​.. రోజుకు ఎన్ని చూడొచ్చో తెలుసా?

Twitter New Rules 2023 : ట్విట్టర్​లో మరో కీలక మార్పు తీసుకువచ్చారు ఆ సంస్థ అధినేత ఎలాన్ ​మస్క్. ట్వీట్​లను చూడడంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా ఈ పరిమితులు ఉన్నాయి.

twitter reading limit
ట్వీట్టర్​ రీడింగ్​ లిమిట్స్​
author img

By

Published : Jul 2, 2023, 7:35 AM IST

Updated : Jul 2, 2023, 8:32 AM IST

Twitter Post Limit : ట్విట్టర్​​ అధినేత ఎలాన్ ​మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజువారీగా చూసే పోస్ట్​లపై పరిమితులు విధించారు. వెరిఫైడ్ ఖాతాదారులకు రోజుకు 6,000 పోస్ట్​లు మాత్రమే చూసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్​వెరిఫైడ్​ ఖాతాదారులు రోజుకు 600 పోస్ట్​లు మాత్రమే చూడొచ్చని పేర్కొన్నారు. కొత్త అన్​వెరిఫైడ్​ ఖాతాదారులు కేవలం 300 పోస్ట్​లు మాత్రమే చూడొచ్చని వివరించారు. ట్విట్టర్​లో డేటా స్క్రాపింగ్, సిస్టమ్​ మ్యానుపులేషన్​ నివారించేందుకే.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్​మస్క్​ ట్వీట్​ చేశారు. త్వరలోనే రోజువాారిగా చూసే పోస్ట్​ల సంఖ్యను వెరిఫైడ్ ఖాతాదారులకు 8వేలకు, అన్​వెరిఫైడ్​ ఖాతాదారులు 800లకు, కొత్త అన్​వెరిఫైడ్​ 400లకు పెంచనున్నట్లు మస్క్​ మరో ప్రకటనలో వెల్లడించారు. మస్క్​ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారుడు తన పరిమితికి మించి పోస్ట్​లను చూసిన తరువాత.. స్క్రోలింగ్ బ్లాక్​ అయ్యే అవకాశం ఉంది.

ట్విట్టర్ సేవలకు అంతరాయం
ఇదిలా ఉండగా శనివారం ప్రపంచ​వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అనతంరం ట్విట్టర్​లో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీనిపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్​లు చేశారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ట్విట్టర్‌ అంతరాయం తర్వాత.. వినియోగాదారులు తమ అనుభవాలను చెెప్పేందుకు వేలాది సంఖ్యలో ట్విట్టర్​ను సందర్శించారు. దీంతో ట్విట్టర్​ యాక్సిస్​లో ఉన్న వారు సైతం సమస్యలను ఎదుర్కొన్నారు. 45 శాతం యాప్​లో, 40 శాతం వెబ్​సైట్​లో, మిగిలిన 15 శాతం ఫీడ్​లో సమస్యలు తలెత్తాయి.

  • Rate limits increasing soon to 8000 for verified, 800 for unverified & 400 for new unverified https://t.co/fuRcJLifTn

    — Elon Musk (@elonmusk) July 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • To address extreme levels of data scraping & system manipulation, we’ve applied the following temporary limits:

    - Verified accounts are limited to reading 6000 posts/day
    - Unverified accounts to 600 posts/day
    - New unverified accounts to 300/day

ట్వీట్‌ని చూడటానికి, పోస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు "Cannot retrieve tweets" అనే ఎర్రర్ మెసేజ్​ వచ్చినట్లు వినియోగదారులు తెలిపారు. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొనలేదని సమాచారం. దాదాపు 7500 వినియోగదారులకు పైగా ఈ సమస్యను ఎదుర్కొనవచ్చని డౌన్ డిటెక్టర్ అంచనా వేసింది. 200 మిలియన్​లకు పైగా వినియోగదారులున్న ట్విట్టర్​కు.. ఈ సంఖ్య చాలా చిన్నదిగానే భావించవచ్చని డౌన్ డిటెక్టర్​ వెల్లడించింది. శనివారం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 'ట్విట్టర్​ డౌన్​' హాష్​టాగ్​ విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే ట్విటర్​లో కలిగిన అసౌకర్యాలపై ఆ సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Twitter Verification Content Creator : కాగా కొద్ది రోజుల క్రితం.. త్వరలోనే తన వేదికలో మోనటైజేషన్​ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.​ కొత్త సీఈఓ లిండా యాకరినో ట్విట్టర్​ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వెరిఫైడ్​ కంటెంట్ క్రియేటర్స్​కి మాత్రమే ఈ మోనటైజేషన్​ ఇవ్వనున్నట్లు ట్విట్టర్​ తెలిపింది. ఇందుకోసం సుమారుగా 5 మిలియన్​ డాలర్లు అంటే సుమారుగా రూ.41కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా పేర్కొంది. వెరిఫైడ్ కంటెంట్​ క్రియేటర్స్​​ ఖాతాలకు మాత్రమే యాడ్​లను సర్వ్​ చేస్తామని ట్విట్టర్ మాజీ సీఈఓ ఎలాన్​ మస్క్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Jul 2, 2023, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.