ETV Bharat / science-and-technology

సైబర్ దాడులపై యుద్ధం.. మీరూ కావొచ్చు 'ఈ-రక్ష'కులు! - NCERT compitation techno games latest news

సాంకేతికత ఇంటింటికీ విస్తరిస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ మొబైల్‌/ కంప్యూటర్‌ ద్వారా అంతర్జాల వాడకం అంతకంతకూ పెరిగిపోతోంది. కొవిడ్‌-19 పరిణామాలతో ఇప్పుడు ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరి మార్గమైంది. అయితే- అద్భుత ఉపయోగాలతోపాటు ఎన్నో చిక్కులూ దీని ద్వారా ఏర్పడుతున్నాయి. అందుకే సురక్షితమైన ఇంటర్నెట్‌ వినియోగానికి ప్రాధాన్యం! విద్యార్థులూ ఉద్యోగార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండకతప్పదు. దీనిపై అందరిలోనూ చైతన్యం పెంచటానికి ఆకర్షణీయమైన పోటీలు జరగబోతున్నాయి. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చి అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ‘ఈ-రక్ష కాంపిటిషన్‌’ పేరుతో పోటీలను నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థుల నుంచి పెద్దల వరకు ఎవరైనా దీనిలో పాల్గొనవచ్చు. నెగ్గితే ట్రోఫీలూ, సర్టిఫికెట్లూ సాధించొచ్చు!

మీరూ కావొచ్చు ఈ-రక్షకులు!
మీరూ కావొచ్చు ఈ-రక్షకులు!
author img

By

Published : Jun 26, 2020, 3:01 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

undefined
మీరూ కావొచ్చు ఈ-రక్షకులు!

ఒకప్పటిలా కాదు. ఇప్పుడు ఏ పనైనా మునివేళ్ల కదలికలతో పూర్తవుతోంది. ఆటలు, కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారం, చదువు.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌ బాటపట్టాయి. ఒకరకంగా అంతర్జాలం (ఇంటర్నెట్‌) కూడా నిత్యావసరాల్లో భాగంగా మారిపోయింది. పనిని సులభతరం చేసేస్తోంది. ఇది అనుకూలాంశమైతే, నిగూఢంగా ఎన్నో పెను సమస్యలు దీనిలో పొంచి ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో బాధకూ, మనోవ్యధకూ గురిచేసే అసభ్యకర వ్యాఖ్యలు, ఆన్‌లైన్‌ మోసాలు, వెబ్‌లో చక్కర్లు కొట్టే నకిలీ (ఫేక్‌) వార్తలు... ఇవన్నీ వీటిలో భాగమే. ఇటీవల కొవిడ్‌-19పైనా తప్పుడు వార్తలు, సమాచారమూ ఎంతోమందిని భయాందోళనలకు గురిచేసి, సామాజిక జాడ్యంలా తయారైంది. ఇది ప్రజలకే కాదు, ప్రభుత్వాలకూ సమస్యగా, శిరోభారంగా మారింది.

వీటిని కట్టడి చేయటం కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్‌సీఈఆర్‌టీ కొన్ని పోటీలను నిర్వహిస్తోంది. ‘ఈ-రక్ష’ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం డిజిటల్‌ సిటిజన్‌షిప్, ఆన్‌లైన్‌ సేఫ్టీ, ఫేక్‌ న్యూస్, మిస్‌ ఇన్ఫర్మేషన్‌ అంశాలపై దీనిలో దృష్టి సారిస్తారు.

ఎన్‌సీఈఆర్‌టీ సంస్థ సైబర్‌ పీస్‌ ఫౌండేషన్, ఎన్‌సీపీఆర్, యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో)లతో కలిసి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న నెటిజన్లకు దీనిలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ మొదలైనవారూ దీనిలో పాల్గొనే వీలుంది. భద్రత, బాధ్యతతో కూడిన నెటిజన్లుగా ఉండటానికి అవసరమైన చక్కని సూచనలూ, పకడ్బందీ వ్యూహాలను ఇందులో తెలపాల్సి ఉంటుంది. అబద్ధపు వార్తలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించడంపైనా ఆచరణయోగ్యమైన సూచనలు చేయాల్సి ఉంటుంది.
ఏమేం పోటీలు?

undefined
మీరూ కావొచ్చు ఈ-రక్షకులు!

మొత్తం 5 రకాల పోటీలు ఇందులో ఉన్నాయి. డిజిటల్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ అనేది థీమ్‌. గోప్యత, భద్రత, ట్రోలింగ్, సెక్యూరిటీ టిప్స్, ఆన్‌లైన్‌ మోసాలు, భయపెట్టడం, బెదిరించడం, ఫిషింగ్, మాల్వేర్‌ మొదలైనవాటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.
1. ఆర్ట్‌కేడ్‌: ఆన్‌లైన్‌ భద్రతకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆర్టిస్టిక్‌ నైపుణ్యాల ద్వారా వివరించాల్సి ఉంటుంది. డ్రాయింగ్స్, పెయింటింగ్స్, కామిక్స్, మీమ్స్, స్టిక్కర్స్, కామిక్‌ స్ట్రిప్స్‌ల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చు. దేన్నైనా బొమ్మల రూపంలోనే చెప్పాల్సి ఉంటుంది. స్లోగన్లకు ఆస్కారమివ్వకూడదు. గెలిచినవారి ఎంట్రీలను భాగస్వామ్య సంస్థల వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా వేదికల్లో పోస్ట్‌ కూడా చేస్తారు. సొంతంగా గీయాలి. నెట్‌లో నుంచి కాపీ కొట్టినవాటిని తిరస్కరిస్తారు. పెన్సిల్‌/ చార్‌కోల్‌/ వాటర్‌ కలర్స్‌/ స్కెచ్‌/ క్రేయాన్స్‌/ ఆయిల్‌ పెయింట్‌ మొదలైనవాటిల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. పేపర్‌ సైజు ఎ4/ఎ3/ఎ2గా ఉండాలి. చార్ట్, కాన్వాస్‌ పేపర్, కాన్వాస్‌ షీట్, ఫొటో స్టెయిన్‌ పేపర్‌ మొదలైవాటిల్లో దేనిమీదైనా గీయొచ్చు. గీసినదాన్ని వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
2. టెక్‌ ఆవిష్కార్‌: దీనిలో ఆన్‌లైన్‌ భద్రతకు అభ్యర్థులు ఇచ్చే ప్రాధాన్యాన్ని కోడింగ్, ఇంజినీరింగ్‌ స్కిల్స్‌ ఆధారంగా చూపించాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ మొదలైనవాటిని ఉపయోగించవచ్చు. సాఫ్ట్‌వేర్‌ (మొబైల్‌ ఆప్స్‌/ వెబ్‌ ఆప్‌/ సోర్స్‌ కోడింగ్‌), హార్డ్‌వేర్‌ (ఇన్నవేషన్‌ డివైజ్‌/ మాడ్యూల్‌ డెవలప్‌మెంట్‌), ఫర్మ్‌వేర్‌ (సాఫ్ట్‌వేర్‌ కంట్రోల్డ్‌ డివైజ్‌లు, అప్లియన్సెస్‌ మొదలైనవి)ల్లో నచ్చినదాన్ని రూపొందించవచ్చు.వ్యక్తిగతంగా లేదా బృందంగా (ముగ్గురికి మించకూడదు) పోటీ పడవచ్చు. దీనిలో విద్యార్థులకు మాత్రమే పాల్గొనే అవకాశముంది. ఒకే ఎంట్రీని సమర్పించే వీలుంది. బృందం మినహా బయటి నుంచి సాయం తీసుకోకూడదు. రూపకల్పన ఏదైనా సొంతదై ఉండాలి. కాపీ/ మోసం చేసినట్లు అనిపిస్తే తిరస్కరణకు గురవుతుంది. పోటీలో సమర్పించినదాన్ని వేరే అవసరాలకు/ పోటీలకు ఉపయోగించకూడదు. దానికి ఈ-రక్ష, సీపీఎఫ్, ఎన్‌సీఈఆర్‌టీ సహ యజమానులు అవుతారు.
3. వర్డ్‌ హ్యాక్‌: రాత నైపుణ్యాలకు సంబంధించింది. చిన్న కథలు, ఎస్సేలు (కేటగిరీ-1 వారికి మాత్రమే), ఆర్టికల్స్, బ్లాగులు, రిసెర్చ్‌ పేపర్లు (కేటగిరీ- 2, 3 వారికి) రూపంలో పంపొచ్చు. గెలిచినవాటిని భాగస్వామ్య సంస్థల వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా వేదికల్లో ప్రచురిస్తారు.ఎస్సేకు 250-300, బ్లాగులకు 150-200, ఆర్టికల్స్‌కు 250-300, రిసెర్చ్‌ పేపర్లకు 800-1000 పదాలు మించకూడదు. ఒకరు ఒకదాన్ని మాత్రమే పంపే వీలుంది. రాసినదాన్ని స్పష్టత, కచ్చితత్వం, చదవడానికి ఎంతవరకూ వీలుందన్న అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. రాతనైపుణ్యాలు, ఎంచుకున్న థీమ్‌కు అనుగుణంగా ఎంతవరకూ రాశారో కూడా పరిశీలిస్తారు. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. రాసినదాన్ని సర్టిఫై చేయడం తప్పనిసరి. DOC, DOCX, .odt, ODF, PDF, TXT ఫార్మాట్‌ల్లో దేనిలోనైనా పంపొచ్చు. కంప్యూటర్‌ అవకాశం లేనివారు చేతితో రాసిన ప్రతిని ఫొటో తీసైనా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు.
4. స్క్రీన్‌ మాస్టర్స్‌: వీడియోలకు సంబంధించింది. షార్ట్‌ మూవీస్, అవగాహన వీడియోలు, పాటలు, సెటైర్లు, పేరడీ, డాక్యుమెంటరీ, బలమైన మెసేజ్‌తో కూడిన ఇంటర్వ్యూలలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని వీడియో రూపంలో పంపాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా లేదా బృందంగా పంపొచ్చు. బృందంగా ఉన్నవారికి వ్యక్తిగతంగా పంపే అవకాశం లేదు. హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఏ భాషలోనైనా చేయొచ్చు.flv, .mov, .mp4,.wmv ల్లో నచ్చిన ఫార్మాట్‌లో పంపొచ్చు. వీడియో పరిధి 600 సెకన్లు (10 నిమిషాలు) మించకూడదు. వీడియోను నచ్చిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో పోస్టు చేసి, లింకును సమర్పించాల్సి ఉంటుంది.
5. సైబర్‌ పీస్‌ ఆనర్స్‌: ఆన్‌లైన్‌ సేఫ్టీ, సైబర్‌ సెక్యూరిటీలపై పనిచేసినవారికి దీన్ని ఇస్తారు. వ్యక్తిగతంగా, బృందమైనా (సంస్థ) దరఖాస్తు చేసుకోవచ్చు. తమ రంగంలో సాధించిన విజయాల ఆధారంగా అవార్డులను అందజేస్తారు.వ్యక్తులైతే సైబర్‌ సెక్యూరిటీలో అనుభవం, పనిచేసిన ప్రాజెక్టులు, ప్రావీణ్యమున్న అంశాలు, మేనేజ్‌మెంట్‌/ టెక్నాలజీ అచీవ్‌మెంట్లు, ఇన్నవేషన్స్, రిసెర్చ్‌ పేపర్లు, ఆర్టికల్స్, పొందిన అవార్డులు మొదలైనవాటిని పేర్కొనాల్సి ఉంటుంది. సంస్థ పరంగా అయితే స్థాపించిన సంవత్సరం, సైబర్‌ సెక్యూరిటీపరంగా చేసిన కార్యక్రమాలు, విజయాలను పేర్కొనాల్సి ఉంటుంది.

ఎవరు పాల్గొనవచ్చు?
పాల్గొనే వారందరినీ మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-1లో వయసు పదేళ్లకు పైగా వారుంటారు. 17, అంతకు మించిన వయసువారిని కేటగిరీ-2లో చేర్చారు. టీచర్లు, తల్లిదండ్రులు, గార్డియన్లు కేటగిరీ-3 కిందకి వస్తారు.
ప్రతి కేటగిరీ నుంచి విజేతలను ప్రకటిస్తారు. గెలిచినవారికి ట్రోఫీలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. వారి ప్రొఫైళ్లను ప్రాజెక్టు వివరాలతో సహా విన్నర్‌ కంపెండియమ్‌లో చేరుస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయినవారికి అప్రిసియేషన్‌ సర్టిఫికెట్లు ఇస్తారు. పాల్గొన్నవారికీ సర్టిఫికెట్లు అందజేస్తారు.

సురక్షితంగా..బాధ్యతగా
సాంకేతికత వినియోగం విషయంలో మనం దృష్టి పెట్టాల్సిన విషయాలు..
డిజిటల్‌ నైతికత, మర్యాదలూ పాటిస్తూ ఆదర్శ నెటిజన్లుగా తయారవటం తెలివిగా ఎంపిక చేసుకోవడంలో పరిజ్ఞానం, స్పష్టత అంతర్జాలాన్ని సురక్షితంగా, బాధ్యతాయుతంగా, విమర్శనాత్మకంగా వినియోగించటంపై అవగాహన పెంచుకోవటం డిజిటల్‌ హక్కులూ, బాధ్యతలపై చైతన్యం కలగజేయటం.

దరఖాస్తు ఇలా
ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ (www.eraksha.net) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తిచేసుకున్నవారికి ఐడీని ఇస్తారు. దాని ద్వారా పాల్గొంటున్న అంశం ఆధారంగా పోటీలో పాల్గొనవచ్చు.
* దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: సెప్టెంబరు 30, 2020
* ఫలితాల వెల్లడి: నవంబరు 1, 2020
* అవార్డుల అందజేత: డిసెంబరు 1, 2020

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.