విశ్వం అంతు చిక్కని రహస్యాలను తెలుసుకోవడంలో పోటీపడి దూసుకెళ్తున్న సంస్థలు నాసా, ఇస్రో. ప్రతీ ఏటా రాకెట్లు పంపుతూ విశ్వాన్వేషణ చేస్తున్నాయి. అయితే మానవులను ఎన్నోసార్లు పంపిన నాసాకు ఓ చిక్కొచ్చింది. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారట. ఇందుకు కారణం టాయ్‌లెట్ నిర్మాణం, డిజైన్ సరిగ్గా లేకపోవడమే. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న నాసా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు, పరిశోధకులు, ఇంజినీర్లకు ఓ ఛాలెంజ్ విసిరింది. వ్యోమగాములకు ఇబ్బందులు లేకుండా ఓ టాయ్‌లెట్ డిజైన్ రూపొందించాలని కోరింది. ఇందుకోసం రూ.15 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించింది.
-
Just launched: the Lunar Loo Challenges! Be a part of history by designing the toilet astronauts will use during future missions on the moon & Mars. Learn how NASA is #crowdsourcing human waste disposal concepts & how you or your kids can get involved: https://t.co/o15GxUMVM9 pic.twitter.com/wI7Gae2PwY
— HeroX (@Iamherox) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just launched: the Lunar Loo Challenges! Be a part of history by designing the toilet astronauts will use during future missions on the moon & Mars. Learn how NASA is #crowdsourcing human waste disposal concepts & how you or your kids can get involved: https://t.co/o15GxUMVM9 pic.twitter.com/wI7Gae2PwY
— HeroX (@Iamherox) June 25, 2020Just launched: the Lunar Loo Challenges! Be a part of history by designing the toilet astronauts will use during future missions on the moon & Mars. Learn how NASA is #crowdsourcing human waste disposal concepts & how you or your kids can get involved: https://t.co/o15GxUMVM9 pic.twitter.com/wI7Gae2PwY
— HeroX (@Iamherox) June 25, 2020
తొలిసారి...
1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపగా... 1972లో కెర్నన్ చివరిగా చంద్రమండలంపై కాలుమోపారు. ఆ మధ్య కాలంలో 12 మందిని చంద్రుడి మీదకు పంపిన అగ్రరాజ్యం.. ఆ తర్వాత మానవ సహిత ప్రయోగాలు చేయలేదు. ఆనాటి వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టేటప్పుడు డైపర్లు ధరించారట. ఎందుకంటే నాసా తయారు చేసిన అపోలో నౌకలో సరైన టాయ్‌లెట్ సిస్టం లేదట. కప్పుల్లో మూత్రం పోయడం, బ్యాగ్‌ల్లో మలవిసర్జన చేయడమే వారికి ఉన్న ఆప్షన్. స్పేస్ సూట్లో ఉన్నప్పుడు బాత్రూమ్కు వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి డైపర్లు వేసుకునేవారు.
మరోసారి...
2024లో మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో వ్యోమగాముల సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే ఓ టాయ్‌లెట్‌ను రూపొందించాలని.. దాన్ని 'ఆర్టెమిస్' మూన్ ల్యాండర్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ టాయ్‌లెట్ అంతరిక్షంలోని మైక్రో గ్రావిటీ, ల్యూనార్ గ్రావిటీ మీద పనిచేయాల్సి ఉంటుంది. అంటే భూమ్యాకర్షణ శక్తి కంటే అక్కడ 1/6 శాతం తక్కువ గురుత్వాకర్షణలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. లింగభేదం లేకుండా అందరు వ్యోమగాములు వినియోగించుకునేలా ఆ డిజైన్ ఉండాలని చెప్పింది నాసా.
అప్పట్లో ఇలా...
1970ల్లో తయారు చేసిన తొలి అమెరికా టాయ్‌లెట్ విభిన్నంగా ఉండేది. గోడకు చిన్నపాటి రంధ్రం మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో మాత్రం వ్యోమగాములు మూత్ర విసర్జనకు అంత ఇబ్బందులు లేకపోయినా.. ఇప్పటికీ మలవిసర్జనకు బ్యాగ్‌లనే వినియోగిస్తున్నారు. స్పేష్ స్టేషన్లో ఉండేందుకు ఎక్కువగా ఇబ్బందిపెట్టే అంశం ఇదేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రష్యా భారీగా ఖర్చు...
2008 నుంచి దాదాపు 19 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ ఐఎస్ఎస్లో కొత్తతరహా టాయ్‌లెట్ తయారు చేస్తోంది రష్యా. అయితే ఇదే తరహాలోని ఓ కమోడ్ నిర్మాణాన్ని ఇప్పటికే రూపొందించింది స్పేస్ ఎక్స్.
ఎందుకు కష్టమంటే...
చంద్రుడిపైనా పనిచేసే టాయ్‌లెట్ కాస్త కష్టమే.. ఎందుకంటే మైక్రో, ల్యూనార్ గ్రావిటీలో ఇవి పనిచేయాల్సి ఉంటాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న టాయ్లెట్ల కంటే చిన్నగా, తేలికగా నిర్మాణం ఉండాలి. ఫలితంగా వాటిని రాకెట్లలో పంపడానికి ఇందన ఖర్చు తగ్గుతుంది. అందుకే ఈ మేరకు సలహాలు, డిజైన్లు పంపాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కోరింది నాసా.
2017లో నిర్వహించిన స్పేస్ పూప్ ఛాలెంజ్‌లో డాక్టర్. టాట్చర్ కార్డన్ (అమెరికా ఎయిర్‌ఫోర్స్ కర్నల్) డైపర్లు లేకపోయినా బాత్రూమ్కు వెళ్లేందుకు ఓ పద్ధతి కనిపెట్టారు. ఆ డిజైన్‌కు 15వేల డాలర్లు చెల్లించింది నాసా. అయినా దానితోనూ ఇబ్బందులకు పరిష్కారం దొరకలేదు.
సరికొత్తగా ఉండాలి...
"కొత్తగా తయారు చేయబోతున్న టాయ్‌లెట్ నిర్మాణం బరువు 15 కేజీలు దాటకూడదు. ఘనపరిమాణం 0.12 క్యూబిక్ మీటర్లు దాటకూడదు. మినీ ఫ్రిట్జ్ కంటే ఇది చిన్నగా ఉండాలి. శుభ్రం చేయడానికి ఐదు నిముషాలు మాత్రమే పట్టాలి" అని నాసా పేర్కొంది.
ఇవే నిబంధనలు...
- మైక్రోగ్రావిటీ, ల్యూనార్ గ్రావిటీలో పనిచేయాలి.
- భూమిపైనే దాని బరువు 15 కేజీల కన్నా తక్కువ ఉండాలి.
- ఆ కమోడ్ పెట్టడానికి పట్టే స్థలం 0.12 m3(మీటర్ క్యూబ్) దాటకూడదు.
- 70 వాట్ల పవర్‌ను మాత్రమే వినియోగించుకోవాలి.
- టాయ్‌లెట్ ఆపరేట్ చేసేటప్పుడు 60 డెసిబెల్స్ మించిన ధ్వని రాకూడదు.
- మగ, ఆడ వ్యోమగాములు వినియోగించుకోగలగాలి.
- 58 నుంచి 77 అంగుళాల పొడవు, 107 నుంచి 290 పౌండ్ల బరువు ఉన్న వ్యక్తులు అందులో సరిపోవాలి.
- టాయ్లెట్లో తలపెట్టకుండా వాంతులు చేసుకునే సౌకర్యం ఉంటే అదనపు బహుమతి ఇవ్వనున్నారు.
ఆగస్టు 17 సాయంత్రం 5 గంటలకు తర్వాత ఈ కాంటెస్ట్ ముగియనుంది. తొలి బహుమతి 20వేల డాలర్లు, రెండో బహుమతి 10వేల డాలర్లు, మూడో బహుమతి 5వేల డాలర్లు ఇవ్వనున్నారు. ఇందులో 11 నుంచి 18 ఏళ్ల వారూ పాల్గొనవచ్చు కానీ వారికి ప్రత్యేకమైన సర్టిఫికేట్, బహుమతులు ఇవ్వనుంది.
ఇవీ చూడండి: