కరోనా లాక్డౌన్ సడలింపులతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ సంస్థలు జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇందులో మోటోరోలా కాస్త ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఐరోపా మార్కెట్లో మోటోజీ 5జీ ప్లస్ పేరుతో కొత్త ప్రీమియం మోడల్‌ను ఆవిష్కరించింది. ఇటీవలే ఫ్యూజన్ పేరుతో భారత్‌లో ఓ మోడల్‌ను విడుదల చేయడం గమనార్హం.
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (1టీబీ వరకు పెంచుకునే సదుపాయం) వేరియంట్లలో మోటోజీ 5జీ ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చింది మోటో. వీటి ధరలు వరుసగా 349 యూరోలు (దాదాపు రూ.30 వేలు), 399 యూరోలు (దాదాపు రూ.33,730)గా నిర్ణయించింది.
అయితే ఈ మోడల్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై మోటోరోలా ఇంకా స్పష్టతనివ్వలేదు.
మోటోజీ 5జీ ప్లస్ ఫీచర్లు..
- 6.7 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 ప్రాసెసర్
- వెనుక వైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ+5ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
- 16+8 మెగా పిక్సళ్ల డ్యుయల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 10 ఓఎస్
ఇదీ చూడండి:శాంసంగ్ నుంచి మరిన్ని స్మార్ట్‌టీవీలు- రూ. 20 వేలకే!