ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్​లో కొత్త ఫీచర్​- ఇక వర్చువల్​గా వినోదాల విందు

అందరూ కలిసి వీడియోలు చూసేందుకు 'వాచ్​ టుగెథర్​' పేరుతో సరికొత్త ఫీచర్​ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది ఫేస్​బుక్​. దీని ద్వారా.. మీరు ఎక్కడున్నా.. మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్న అనుభూతి పొందుతారని పేర్కొంది. ఇది మెసెంజర్​లో ఈ వారంలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

Facebook Enables Users to Watch Together on Messenger
ఎఫ్​బీ 'వాచ్​ టుగెథర్'​తో దూరంగా.. దగ్గరగా!
author img

By

Published : Sep 15, 2020, 5:30 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

వరుస అప్​డేట్స్​తో జోరు మీదున్న సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​.. మరో అదిరిపోయే ఫీచర్​ను వినియోగదారుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. 'వాచ్​ టుగెథర్​' పేరుతో ఎఫ్​బీ మెసెంజర్​ యాప్​లో ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కలిసి వీడియోలు చూసే వీలు కల్పించే ఈ ఫీచర్​తో.. మీరు మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు ఎంత దూరంలో ఉన్నా.. దగ్గరగా ఉన్న అనుభూతి పొందుతారని చెబుతోంది ఫేస్​బుక్​.

"స్నేహితులు, ఇష్టమైన వారితో దగ్గరగా ఉండేందుకు ఈ 'వాచ్​ టుగెథర్​'ను రూపొందించాం. అందరు కలిసే ఉన్న అనుభూతి దీని ద్వారా కలుగుతుంది. ట్రెండింగ్​లో ఉన్న వీడియోలు, సినిమాలు, క్రీడా కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే.. మీరు మీ స్నేహితులతో కలిసి చూడగలరు. అదే సమయంలో వారి రియాక్షన్​ తెలుసుకోగలరు."

--- ఫేస్​బుక్​.

మెసెంజర్​లో రోజుకు 150 మిలియన్లకుపైగా వీడియో కాల్స్​ జరుగుతున్నట్టు.. 200మిలియన్ల వీడియోలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు ఫేస్​బుక్​ తెలిపింది. ఈ ఫీచర్​ ద్వారా మీకు ఇష్టమైన వాళ్లతో మరింత దగ్గరగా ఉండొచ్చని పేర్కొంది.

మెసెంజర్​ రూమ్​ను రూపొందించి.. లేదా మెసెంజర్​ ద్వారా వీడియో కాల్​ చేసిన అనంతరం ఈ సరికొత్త ఫీచర్​ను వినియోగించుకోవచ్చని ఎఫ్​బీ తెలిపింది. పైకి స్వైప్​ చేస్తే మెనూ వస్తుందని.. అందులో వాచ్​ టుగెథర్​ ఆప్షన్​ ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో 'టీవీ ఆండ్​ మూవీస్​','వాచ్డ్​', 'అప్​లోడెడ్​' వంటి ఆప్షన్లు ఉంటాయని.. తమకు నచ్చిన కేటగిరీలను ఎంపిక చేసుకోవచ్చని వివరించింది.

అయితే ఈ వాచ్​ టుగెథర్​ ఫీచర్​ను ఒకేసారి​... వీడియో కాల్​లో అయితే 8మంది, మెసెంజర్​ రూమ్​లో అయితే 50మంది వాడుకోవచ్చని ఎఫ్​బీ వెల్లడించింది. ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ ఫోన్లలో ఇది ఈ వారంలో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:-

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.