ETV Bharat / science-and-technology

హలో 5జీ: నయా నెట్​వర్క్​ ప్రత్యేకతలేంటి ? - ముకేశ్ అంబానీ

సరికొత్త ఐఫోన్ విడుదలైంది. అత్యాధునిక హంగులతో అధునాతన సాంకేతికతతో తాజా యాపిల్​ ఈవెంట్లో ఐఫోన్​ 12 సిరీస్​ ఆవిష్కరించారు. ఈ ఫోన్​ను 5జీ నెట్​వర్క్​కు​ సపోర్ట్ చేసేలా రూపొందించటం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిష్టాత్మక ఐఫోన్​నే 5జీ ఫీచర్లతో విడుదల చేయటం.. మరోసారి ఈ అత్యాధునిక నెట్​వర్క్​ ప్రత్యేకతలను చర్చకు తీసుకొచ్చింది. ఇంతకీ అసలేంటీ 5జీ గొప్ప ? సాంకేతిక యుగంలో మానవాళి జీవితాలను ఈ భవిష్యత్​ నెట్​వర్క్​ ఎలా సులభం చేస్తుంది ? భారత్​లో 5జీ సంగతేంటి ?

5G wireless
హలో 5జీ.. అత్యాధునిక నెట్​వర్క్​ వ్యవస్థ ప్రత్యేకతలేంటి ?
author img

By

Published : Oct 14, 2020, 12:44 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్​ సంస్థల నుంచి... సాధారణ స్మార్ట్​ఫోన్ వినియోగదారుల వరకు అందరి నోటా వినిపిస్తున్న మాట... 5జీ. మనిషి జీవన విధానాన్నే సమూలంగా ఈ అత్యాధునిక నెట్​వర్క్ మార్చేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. ఆసక్తికరంగా మారింది ఆ సాంకేతికత ప్రయాణం. క్రమక్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఈ 5జీ విప్లవం గురించి తెలుసుకోవాల్సిందేమిటి ? ఈ నెట్​వర్క్​కు ​ సంబంధించి అనేక ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. మరి 5జీ ఆవశ్యకత ఎంతమేరకు ఉంది ?

5జీ... రానున్న కాలాన్ని శాసించనున్న అత్యాధునిక మొబైల్​ నెట్​వర్క్​. భవిష్యత్​ అంతా దీనిదే.

అసలు 5జీ కథేంటి ?

సింపుల్​ భాషలో చెప్పాలంటే.. మొబైల్ నెట్​వర్కింగ్ వ్యవస్థలో సరికొత్తది 5జీ. వైర్​లెస్​ సదుపాయంతో అత్యుత్తమ సేవలు అందించటం ప్రధాన లక్షణం. కనెక్టింగ్ సమస్యలు లేకుండా, సులువుగా ఇంటర్నెట్​ ట్రాఫిక్​ కంట్రోల్​ చేసే సామర్థ్యం ఈ నెట్​వర్క్​ సొంతం.

ఎలా పని చేస్తుంది ?

వైర్​లెస్​. ఇదే 5జీ నెట్​వర్క్​ ప్రాథమిక సూత్రం. ఒకే నెట్​వర్క్ ద్వారా వివిధ పనులు చేసుకునే వీలు కలుగుతుంది. మెరుపు వేగంతో డేటా ట్రాన్స్​ఫర్ అవుతుంది. ఒకే వ్యవస్థ అనేక నెట్​వర్క్​లు, డివైజ్​లతో అనుసంధానమై ఉంటుంది.

ఈ నెట్​వర్క్ వినియోగించేదెలా ?

అయితే, ఈ అధునాతన సేవలు ఆస్వాదించాలంటే నెట్​వర్క్​, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్​ డివైజ్​లు 5జీలోకి అప్​గ్రేడ్​ అవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సంస్థలు కొత్త మోడళ్ల ఫోన్లు విడుదల చేస్తున్నాయి. అయితే, నెట్​వర్క్​ టవర్లను సంస్కరించాల్సి ఉంటుంది. ఇది కాస్త సమయం తీసుకునే ఖరీదైన వ్యవహారం.

5జీ ద్వారా ఏం జరుగుతుంది ?

టెలీ మెడిసిన్ సహా ఆటోమేషన్​, వ్యాపారాల్లో సాంకేతికత వంటి అంశాలను 5జీ కొత్తపుంతలు తొక్కించనుంది. చిటికెలో డౌన్​లోడ్​ అయిపోయే జీబీల డేటా అబ్బురపరచనుంది. కిక్కిరిపోయి ఉన్న ప్రదేశాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్​ లభించనుంది.

దేశాల మాటేంటి ?

ప్రస్తుతానికి 5జీకి వస్తున్న హైప్​ను బట్టి చూస్తే.. త్వరలోనే దేశాలు ఈ నెట్​వర్క్​కు సపోర్ట్​ చేసేలా స్మార్ట్​సిటీలు ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వర్చవల్​ రియాల్టీ, కృత్రిమ మేధ, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, ఐఓటీ, అధునాతన సెన్సార్లతో అత్యద్భుతాలు సృష్టించే అవకాశముంది. వీటన్నింటినీ 5జీ ద్వారా సులువుగా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే ఈ సాంకేతికత అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి దేశాలు.

మరి భద్రత ముప్పు ?

అత్యధిక 5జీ ఉత్పత్తులు చైనా నుంచే వస్తుండటం ప్రపంచ దేశాలను కాస్త కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తిదారులను వివిధ దేశాలు ప్రోత్సహించట్లేదు. స్వదేశీ సాంకేతికతతో లేదంటే.. నమ్మకమైన మిత్ర దేశాల మద్దతుతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాయి. అంతకుమించి భద్రత విషయంలో భయపడటానికి ఏం లేదంటున్నారు నిపుణులు.

ఇదీ చూడండి: 'భారత్​పై చైనా డేటా అస్త్రం- స్వయం సమృద్ధే పరిష్కారం!'

చైనాలో 5జీ ప్రారంభమైందా ?

ఇప్పటికే 5జీ సేవలను చైనా ప్రారంభించింది. దేశంలోని 50 ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీ పోల్చితే 10 నుంచి 100 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్​ అందిస్తోంది. బీజింగ్​, షాంఘై​, గ్వాంగ్జౌ, షెన్​జెన్​ సహా మొత్తం 50 ప్రముఖ నగరాల్లో 5జీ నెట్​వర్క్​ వినియోగంలో ఉంది.

భారత్​ ఏం చేస్తోంది ?

5జీ అందిపుచ్చుకోవటం కోసం భారత్​ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధలో సహకారానికి సంబంధించి జపాన్​తో ఒప్పందం చేసుకుంది. చైనా టెలీకమ్యూనికేషన్​ దిగ్గజం హువావే 5జీ సేవలపై ప్రపంచవ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న నేపథ్యంలో భారత్-జపాన్​ కలిసి ముందడుగు వేశాయి. 5జీ సహా భవిష్యత్తు తరం సాంకేతికతలను భారత్​, ఇజ్రాయెల్​, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

ఇదీ చూడండి: '5జీ అభివృద్ధికి భారత్​-ఇజ్రాయెల్​-అమెరికా భాగస్వామ్యం'

టెలికాం సంస్థలు ఏమంటున్నాయి ?

దేశీయంగా 5జీ సేవలు అందించే దిశగా రిలయన్స్ జియో వడివడిగా అడుగులు వేస్తోంది. త్వరలోనే 5జీ ట్రయల్స్​ను నిర్వహించనున్నట్లు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. 5జీ టెక్నాలజీని సొంతంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

అల్ట్రా హైస్పీడ్‌ కనెక్టివిటీ, తక్కువ ధరల్లో తెచ్చేందకు సన్నద్ధమవుతోంది జియో. 5జీ టెక్నాలజీ కోసం కృషి చేస్తున్న రిలయన్స్ జియోను 'క్లీన్ టెల్కో'గా అభివర్ణిస్తున్నారు.

ఇదీ చూడండి: జియో 5జీ సేవలు వచ్చే ఏడాది ప్రారంభం!

5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికాం దిగ్గజాల ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 5జీ ట్రయల్స్​ నిర్వహించేందుకు జియోతో పాటు.. ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా సంస్థలు టెలికాం శాఖకు గతేడాదే దరఖాస్తు చేసుకున్నాయి. జెడ్​టీఈ, ఎరిక్సన్​, నోకియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. మార్చిలోనే ట్రయల్స్ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి: 5జీ ట్రయల్స్​కు టెలికాం దిగ్గజాల సన్నాహాలు!

మొత్తంగా... అన్నీ కుదిరితో త్వరలోనే 5జీ... హలో అంటూ పలకరించనుంది. అత్యాధునిక నెట్​వర్క్​ వ్యవస్థ సరికొత్త సాంకేతిక విప్లవానికి సన్నద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.

ఇదీ చూడండి: '5జీ​'తో ఐఫోన్​ 12 సిరీస్​- ధరలు ఇలా...

ఇదీ చూడండి: టెక్​ దిగ్గజాల ఫలితాలపై మదుపర్ల దృష్టి

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.