PM Modi ISRO Address : స్పేస్‌లోకి మనుషులను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ మిషన్ ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. త్వరలోనే మానవరహిత ఫ్లైట్ టెస్టులు నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని.. ఆ వివరాలను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ చేపట్టనున్న ఈ తొలి మిషన్.. 2025లో జరిగే అవకాశం ఉందని పీఎంఓ పేర్కొంది. అక్టోబర్ 21న గగన్‌యాన్ తొలి ఫ్లైట్ టెస్టును ఇస్రో నిర్వహించనున్నట్లు తెలిపింది.
సరికొత్త లక్ష్యాలు
Indian Space Station : ఈ సందర్భంగా.. మరిన్ని కొత్త పరిశోధనలు చేపట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడిని ( First Indian To Land On Moon ) పంపించాలని ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ సూచించారు. 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి ల్యాండర్‌ను పంపించాలని మోదీ పేర్కొన్నారు. శుక్రగ్రహం వద్దకు ఆర్బిటార్‌ను పంపించే మిషన్‌పై పని చేయాలని సూచించారు.
-
VIDEO | PM Modi chaired a high-level meeting to assess progress of India’s Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours earlier today.
— Press Trust of India (@PTI_News) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Department of Space presented a comprehensive overview of the Gaganyaan Mission, including various… pic.twitter.com/Q2fBqPvoS2
">VIDEO | PM Modi chaired a high-level meeting to assess progress of India’s Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours earlier today.
— Press Trust of India (@PTI_News) October 17, 2023
The Department of Space presented a comprehensive overview of the Gaganyaan Mission, including various… pic.twitter.com/Q2fBqPvoS2VIDEO | PM Modi chaired a high-level meeting to assess progress of India’s Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours earlier today.
— Press Trust of India (@PTI_News) October 17, 2023
The Department of Space presented a comprehensive overview of the Gaganyaan Mission, including various… pic.twitter.com/Q2fBqPvoS2
"చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ల విజయాల పరంపరకు కొనసాగింపుగా.. సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్లాలని మోదీ దిశానిర్దేశం చేశారు. చంద్రుడిపై పరిశోధనలకు భారత ప్రభుత్వంలోని స్పేస్ డిపార్ట్మెంట్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తుందని తెలిపారు. చంద్రయాన్ ప్రయోగాలను సమీక్షించడం, తర్వాతి తరం లాంఛ్ వాహనాలను (ఎన్జీఎల్వీ) నిర్మించడం, కొత్త లాంఛ్ ప్యాడ్‌ను అభివృద్ధి చేయడం, మానవకేంద్రంగా నడిచే ల్యాబ్‌లు, అనుబంధ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు ఈ రోడ్‌మ్యాప్ ఉపయోగపడుతుంది."
-పీఎంఓ ప్రకటన
20 ప్రయోగాలు.. 3 మానవరహిత మిషన్లు..
గగన్‌యాన్ మిషన్ పురోగతిపై చేపట్టిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గగన్‌యాన్ మిషన్‌పై సమగ్ర వివరాలను మోదీకి సోమనాథ్ తెలియజేశారు. ఇప్పటివరకు అభివృద్ధి చేసిన సాంకేతికతల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 20 భారీ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. మూడు మానవరహిత మిషన్లను ప్రయోగించనుంది.
పొదుపు మంత్రం ఇప్పుడు ఓకే.. కానీ ఫ్యూచర్లో భారీ రాకెట్లు అవసరం : ఇస్రో మాజీ చీఫ్ శివన్