ETV Bharat / science-and-technology

PhonePe Launches Indus Appstore : గూగుల్​ ప్లేస్టోర్​కు పోటీగా..​ ఫోన్​పే ఇండస్​ యాప్​స్టోర్​ లాంఛ్​! - phonepe indus app store fees for android publish

PhonePe Launches Indus Appstore In Telugu : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్​పే (PhonePe).. గూగుల్ ప్లేస్టోర్​, యాపిల్ స్టోర్​లకు పోటీగా సరికొత్త ఇండస్ యాప్​స్టోర్​ను లాంఛ్ చేసింది. ప్రస్తుతం ఈ వేదికలో పూర్తిగా ఉచితంగా యాప్స్​ను లిస్ట్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..

PhonePe new Appstore
PhonePe Launches Indus Appstore
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 7:05 PM IST

PhonePe Launches Indus Appstore : గూగుల్​, యాపిల్ స్టోర్లకు పోటీగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్​పే (PhonePe).. 'ఇండస్​ యాప్​ స్టోర్'​ను లాంఛ్​ చేసింది. యాప్​ డెవలపర్ల కోసం ఈ సరికొత్త వేదికను అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది.

Indus Appstore : డెవలపర్లు తమ అప్లికేషన్లను (యాప్​) ఇండస్​ యాప్​స్టోర్​లో లిస్ట్ చేయాలని కోరింది. అది కూడా పూర్తి ఉచితంగా. ఇండస్​ యాప్​స్టోర్​ త్వరలో 12 స్థానిక భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఫోన్​పే వెల్లిడించింది.

గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకే!
ప్రస్తుతం మార్కెట్​లో గూగుల్ ప్లేస్టోర్​, యాపిల్​ స్టోర్​ల హవా నడుస్తోంది. వీటి గుత్తాధిపత్యం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్​పే వాటికి ధీటైన సవాల్ విసురుతూ.. మార్కెట్​లోకి తన సరికొత్త యాప్​స్టోర్​ను తీసుకొచ్చింది.

లిస్ట్​ చేయడం ఎలా?
ఆండ్రాయిడ్ డెవలపర్లు ఇండస్​ యాప్​ స్టోర్​లో రిజిస్టర్ చేసుకోవాలంటే.. ముందుగా www.indusappstore.com వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి. తరువాత రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత తాము రూపొందించిన యాప్స్​ను అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అంతా ఉచితం అని ఫోన్​పే స్పష్టం చేసింది.

ఉచితం!
ఫోన్​పే యాప్​స్టోర్ ఫీజు విషయంలో ఒక స్పష్టత ఇచ్చింది. తొలి ఏడాది డెవలపర్స్ నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయమని స్పష్టం చేసింది. అయితే మరుసటి సంవత్సరం నుంచి స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే యాప్​ డెవలపర్స్ నుంచి ఎలాంటి ప్లాట్​ఫాం ఫీజుగానీ, ఇన్​-యాప్​ పేమెంట్​పై కమిషన్​ తీసుకోమని స్పష్టం చేసింది.

నచ్చిన పేమెంట్​ గేట్​వే!
గూగుల్​ ప్లేస్టోర్​, యాపిల్ స్టోర్లలో డిఫాల్ట్ పేమెంట్​ గేట్​వేస్ మాత్రమే ఉంటాయి. వీటిని ఉపయోగించి మాత్రమే పేమెంట్స్ అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యూజర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. అందుకే ఫోన్​పే.. యూజర్లు తమకు నచ్చిన పేమెంట్ గేట్​వేను పూర్తి ఉచితంగా ఇంటిగ్రేట్​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

డెవలపర్స్​కు గుడ్​ న్యూస్
గూగుల్ ప్లేస్టోర్​, యాపిల్ స్టోర్స్​.. ఇన్​-యాప్​ పర్చేజెస్​పై 30 శాతం వరకు కమీషన్​ వసూలు చేస్తున్నాయి. పైగా నచ్చిన పేమెంట్ గేట్​వేను లేదా పేమెంట్ ప్రాసెసింగ్​ సిస్టమ్​ను ఎంచుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నాయి. వీటిపై డెవలపర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అందుకే వాళ్లకు అనువుగా ఉండే విధంగా.. ఇండస్ యాప్​స్టోర్​ను తీసుకొచ్చినట్లు ఫోన్​పే చీఫ్​ ప్రొడక్ట్ ఆఫీసర్​ ఆకాశ్​ డోంగ్రే తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.